సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా.. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం

Published Wed, Jan 3 2024 3:37 PM

South Africa U19 Tri Series: India Beat South Africa By 7 Wickets - Sakshi

సౌతాఫ్రికాలో జరుగుతున్న అండర్‌ 19 ముక్కోణపు సిరీస్‌లో యువ భారత జట్టు.. సౌతాఫ్రికా అండర్‌ 19 జట్టును 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టోర్నీలో భాగంగా నిన్న (జనవరి 2) జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది.

ఆరాధ్య శుక్లా (4/43), సౌమీ పాండే (3/49), అర్షిన్‌ కులకర్ణి (2/53) సౌతాఫ్రికాను కుప్పకూల్చారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ప్రిటోరియస్‌ (67), స్టీవ్‌ స్టాల్క్‌ (46), మోకోయినా (28 నాటౌట్‌) మాత్రమే రాణంచగా.. మిగతావారంతా తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. 

అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌.. ఆదర్శ్‌ సింగ్‌ (66), అర్షిన్‌ కులకర్ణి (91), అరవెల్లి అవినాశ్‌ (60 నాటౌట్‌) రాణించడంతో మరో 55 బంతులు మిగిలుండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ప్రొటీస్‌ బౌలర్లలో మోకోయినా 2, జుయాన్‌ జేమ్స్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

ఈ ముక్కోణపు టోర్నీలో భారత్‌, సౌతాఫ్రికాలతో పాటు ఆఫ్ఘనిస్తాన్‌ పాల్గొంటుంది. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌.. టీమిండియా చేతిలో, రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడింది. జనవరి 4న ఆఫ్ఘనిస్తాన్‌.. టీమిండియాతో తలపడుతుంది. అనంతరం 6న భారత్‌-సౌతాఫ్రికా, 8న సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్‌, జనవరి 10న ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement