Sourav Ganguly Dancing Near London Eye With Family On 50th Birthday Goes Viral - Sakshi
Sakshi News home page

Sourav Ganguly 50th Birthday: లండన్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్‌ చేసుకున్న దాదా

Jul 9 2022 8:59 AM | Updated on Jul 9 2022 10:25 AM

Sourav Ganguly Dancing Near London Eye With Family On 50th Birthday Goes Viral - Sakshi

టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ ప్రస్తుత బాస్‌ సౌరవ్ గంగూలీ తన 50వ జన్మదిన (జులై 8) వేడుకలను లండన్‌లో ఘనంగా జరుపుకున్నాడు. అడ్వాన్స్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను మిత్రులు (సచిన్‌), శ్రేయోభిలాషులతో కలిసి బుధవారం ముంబైలో జరుపుకున్న దాదా.. గురువారం రాత్రి లండన్‌లో మరోసారి బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకున్నాడు. దాదా.. లండన్‌ వీధుల్లో భార్య డోనా, కూతురు సనాతో పాటు మరికొంతమంది మిత్రులతో కలిసి బర్త్‌డే పార్టీని ఎంజాయ్ చేశాడు. 

కూతురు సనా ఎదురుగా బాలీవుడ్ బాద్షా షారుక్‌ ఖాన్‌ నటించిన ఓం శాంతి ఓం సినిమాలోని టైటిల్ సాంగ్‌కు చిందేస్తూ పరవశించిపోయాడు. అలాగే మరో బాలీవుడ్‌ హిట్‌ సాంగ్‌కు భార్య డోనాతో కాలుకదిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. గంగూలీలోని డ్యాన్సింగ్‌ యాంగిల్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దాదాగిరితో పాటు గంగూలీలో ఈ కోణం కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, పుట్టిన రోజు సందర్భంగా గంగూలీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సహచర క్రికెటర్లు, అభిమానులు దాదాకు హాఫ్‌ సెంచరీ గ్రీటింగ్స్ తెలిపారు.
చదవండి: Sourav Ganguly: గంగూలీ బర్త్‌డే.. ఒకరోజు ముందుగానే సెలబ్రేషన్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement