IND-W vs ENG-W: శభాష్ మంధాన.. తనకు దక్కిన అవార్డును!

Smriti Mandhana dedicates her Player of the Match award to Jhulan Goswami - Sakshi

హోవ్ వేదికగా ఇంగ్లండ్‌ మహిళలలతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన 95 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోసింది. దీంతో  మంధాన అద్భుత ప్రదర్శనకు గాను ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

అయితే మంధాన మరో సారి తన క్రీడా స్పూర్తిని ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో తన దక్కిన ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డును భారత వెటరన్‌ ఝులన్ గోస్వామికి అంకితం చేసింది. కాగా గోస్వామి తన  కెరీర్‌లో చివరి అంతర్జాతీయ సిరీస్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. లార్డ్స్‌ వేదికగా జరగనున్న అఖరి వన్డేలో గోస్వామికి ఘనంగా విడ్కోలు పలకాలని భారత జట్టు భావిస్తోంది.

ఇక పోస్ట్‌ మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో మంధాన మాట్లాడూతూ.. "ఈ మ్యాచ్‌లో నా ఇన్నింగ్స్‌ పట్ల సంతృప్తిగా ఉన్నాను. అయితే అఖరి వరకు క్రీజులో నిలిచి ఉండి మ్యాచ్‌ను ఫినిష్‌ చేయాలని అనుకున్నాను.  ముఖ్యంగా మ్యాచ్‌ను వీక్షించచడానికి వచ్చిన భారత అభిమానులకు ప్రత్యేక దన్యావాదాలు.

అదే విధంగా టీ20 క్రికెట్‌ కంటే వన్డే క్రికెట్‌ ఆడటానికి ఎక్కువగా ఇష్టపడతాను. ఇక ఈ మ్యాచ్‌లో నాకు దక్కిన  ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డును ఝులన్ గోస్వామికి అంకితం చేయాలనుకుంటున్నాను. అదే విధంగా ఈ సిరీస్‌ను గెలిచి మేము  గోస్వామికి అంకితం ఇస్తాము" అని పేర్కొంది.
చదవండి: T20 WC 2022: తుది జట్టులో డీకే లేదంటే పంత్‌? నేనైతే ఏం చేస్తానంటే: టీమిండియా దిగ్గజం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top