'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌' పాటతో స్కేటింగ్‌లో గోల్డ్‌ మెడల్‌

 Slumdog Millionaire Inspire-Georgian Figure Skater Clinch European Title - Sakshi

జార్జియాకు చెందిన అనస్తాసియా గుబనోవా యూరోపియన్‌ ఫిగర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌(EURO 2023) విజేతగా నిలిచింది. అయితే ఆమె బ్లాక్‌బాస్టర్‌ సినిమా.. ఆస్కార్‌ విజేత స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ మ్యూజిక్‌తో దాదాపు నాలుగు నిమిషాల 30 సెకన్ల పాటు స్కేటింగ్‌ చేయడం విశేషం. మధ్యలో బాలీవుడ్‌ సినిమా గలియోంకీ రాస్‌లీలా రామ్‌లీలాలోని సూపర్‌హిట్‌ సాంగ్‌ డోల్‌ బాజే పాట కూడా వినిపించడం విశేషం. భారతీయ సంప్రదాయమైన చీరకట్టుతో అనస్తాసియా గుబనోవా స్కేటింగ్‌ చేస్తూ అందరి ప్రశంసలను అందుకుంది. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

ఇక అనస్తాసియా గుబనోవా బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌లో 11వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే శనివారం జరిగిన యూరో స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌లో 199.1 పాయింట్లు సాధించి తొలి స్థానంలో నిలిచి గోల్డ్‌ మెడల్‌ అందుకుంది. ఇక బెల్జియంకు చెందిన లియోనా హెండ్రిక్స్‌ 193.2 పాయింట్లో రెండో స్థానంలో నిలవగా.. మూడో స్థానంలో స్విట్జర్లాండ్‌కు చెందిన కిమ్మి 192.5 పాయింట్లతో కాంస్యం సాధించింది.

చదవండి: ఎగతాళి చేసిన గడ్డపైనే చప్పట్లు కొట్టించుకుంది

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top