IND vs SL: వారెవ్వా సిరాజ్‌.. శ్రీలంక బ్యాటర్‌కు ఊహించని షాక్‌! వీడియో వైరల్‌

Siraj affects a brilliant run out to dismiss Chamika Karunaratne in the 3rd ODI - Sakshi

తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో తన 10 ఓవర్ల కోటాలో సిరాజ్‌ 32 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక 317 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. అదేవిధంగా టీమిండియా ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, శుబ్‌మాన్‌ గిల్‌ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు.

సంచలన రనౌట్‌తో మెరిసిన సిరాజ్‌..
ఏక పాక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ ఈ మ్యాచ్‌లో సంచలన రనౌట్‌తో మెరిశాడు. శ్రీలంక ఇన్నింగ్స్‌ 12 ఓవర్‌ వేసిన సిరాజ్‌ బౌలింగ్‌లో నాలుగో బంతిని కరుణరత్నే నాన్‌స్ట్రైకర్‌ వైపు డిఫెన్స్‌ ఆడాడు. వెంటనే బంతిని అందుకున్న సిరాజ్‌ సమయస్ఫూర్తితో రెప్పుపాటులోనే స్ట్రైకర్‌ వైపు స్టంప్స్‌ను గిరాటేశాడు.

దీంతో ఫీల్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశాడు. అయితే తను క్రీజులో ఉన్నానని భావించిన కరుణరత్నేకు మాత్రం ఊహించని షాక్‌ తగిలింది. ఎందుకంటే కరుణరత్నే క్రీజుకు కొంచెం వెలుపుల ఉన్నట్లు రిప్లేలో సృష్టంగా కన్పించింది. దీంతో థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో భారత ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: IND vs SL: ఇదేం ఆనందంరా బాబు.. బంతిని ఫొటో తీసిన ఫ్యాన్‌! కోహ్లి రియాక్షన్‌ వైరల్‌

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top