source: X
నిన్న ముల్లాన్‌పూర్‌లో జరిగిన చివరి వన్డేలో భారత్‌ను ఓడించిన తర్వాత వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో ఒంటిచేత్తో తన జట్టును విజయతీరాలు దాటించిన అతడు.. తన ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించాడో వివరించాడు. భారత్‌లో మంచు ప్రభావం మొదలైన తర్వాత ఛేజింగ్ కొంత సులభంగా మారుతుందని చెప్పాడు.
“భారత్‌లో ఆడుతున్నప్పుడు, ముఖ్యంగా మంచు పడటం మొదలైన తర్వాత ఛేజింగ్ చాలా సులభంగా ఉంటుంది. సిరీస్‌ను బలమైన విజయంతో ముగించాలనుకున్నాం. ఈ రోజు చివరికి మేం గెలవడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నాడు.
గజ్జల్లో నొప్పి
తన ఇన్నింగ్స్ సమయంలో అసౌకర్యానికి గురైన విషయాన్ని కూడా హోప్ వెల్లడించాడు. “30 ఓవర్లు పూర్తయ్యే సమయానికి గజ్జల ప్రాంతంలో కొంత అసౌకర్యంగా అనిపించింది. అయినా చివరి వరకు పోరాడాలని నిర్ణయించుకున్నాను” అని తెలిపాడు.
ధోని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి
భారీ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో తనకు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇచ్చిన సలహా ఎంతో ఉపయోగపడిందని చెప్పాడు.
“రెండు వికెట్లు కోల్పోయాక ఛేజ్ ఎప్పుడూ సవాలుగానే ఉంటుంది. ఆ సమయంలో ధోని నాతో చెప్పిన మాటలను ఆచరణలో పెట్టాను. నువ్వు అనుకుంటున్న దానికంటే నీకు ఎక్కువ సమయం ఉంటుందని ధోని తనతో చెప్పినట్లు వెల్లడించాడు.
అందుకే చివరి ఫలితంపై ఎక్కువగా దృష్టి పెట్టకుండా ప్రక్రియపైనే ఫోకస్ చేశాను. మ్యాచ్‌ను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఆడాను. చివరి దశలో బౌండరీలు ఎలా సాధించాలనే దానిపై దృష్టి పెట్టాను” అని వివరించాడు.
ఆ విషయాన్ని కూడా లెక్కలోకి తీసుకున్నా
ఛేజింగ్ సమయంలో భారత జట్టు నాలుగు ఓవర్లు వెనుకబడటాన్ని కూడా తాను పరిగణనలోకి తీసుకున్నానని హోప్ తెలిపాడు.
“భారత్ ఓవర్లలో వెనుకబడిందని నాకు తెలుసు. అందువల్ల చివరి దశలో వారు ఇద్దరు ఫీల్డర్లను సర్కిల్‌లోకి తీసుకురావాల్సి వస్తుందని అర్థమైంది. ఐదుగురు ఫీల్డర్లు 30-యార్డ్ సర్కిల్‌లో ఉండాల్సి వస్తే స్కోరును కాపాడటం ఎప్పుడూ కష్టమే. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ లెక్కలోకి తీసుకున్నాను. చివరికి అవన్నీ మాకు అనుకూలంగా మారాయి” అని చెప్పాడు.
కాగా, భారత్‌తో నిన్న జరిగిన చివరి వన్డేలో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఓడినా భారత్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత్ నిర్దేశించిన 352 పరుగుల భారీ లక్ష్యాన్ని విండీస్ మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది. షాయ్ హోప్ అజేయ శతకంతో (162 నాటౌట్) విండీస్‌ను విజయతీరాలకు చేర్చాడు.
ఇదీ చదవండి: విండీస్ చేతిలో ఓటమి అనంతరం గిల్ స్పందన ఇదే..!


