భారత జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్ల రీఎంట్రీ | Savita, Deepika Return As Hockey India Announce Women's Squad For Argentina Tour | Sakshi
Sakshi News home page

భారత జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్ల రీఎంట్రీ

Apr 8 2026 6:43 PM | Updated on Apr 8 2026 6:48 PM

Savita, Deepika Return As Hockey India Announce Women's Squad For Argentina Tour

ఏప్రిల్‌ 13–17 వరకు అర్జెంటీనాలో జరుగబోయే నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం 24 మంది సభ్యుల భారత మహిళల హాకీ జట్టును హాకీ ఇండియా ఇవాళ (ఏప్రిల్‌ 8) ప్రకటించింది. స్టార్‌ ప్లేయర్లు సవితా పూనియా (గోల్‌ కీపర్‌), దీపిక (ఫార్వర్డ్‌) ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చారు. 

సలీమా టేటే కెప్టెన్‌గా కొనసాగుతారు. జ్యోతి, ముంతాజ్‌ ఖాన్‌ జట్టులోకి తిరిగి వచ్చారు. రుతుజా, ఇషికా, సాక్షి రాణా వంటి యువ ప్లేయర్లకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. సవితతో పాటు మరో గోల్‌ కీపర్‌గా బిచు దేవి ఎంపికయ్యారు.

డిఫెండర్లుగా నిక్కీ ప్రధాన్‌, ఇషికా చౌధరి, సుశీలా చాను, మనీషా చౌహాన్‌, లల్తంత్లుయాంగి, జ్యోతి, ఉదితా చోటు దక్కించుకున్నారు. మిడ్‌ఫీల్డర్లుగా వైష్ణవి విఠల్‌ ఫల్కే, సాక్షి రాణా, సునెలితా టోప్పో, సలీమా టేటే, నేహా, దీపికా సోరెంగ్‌, రుతుజా దాదాసో పిసాల్‌, ఇషికా .. ఫార్వర్డ్ ప్లేయర్లుగా బల్జీత్‌ కౌర్‌, నవనీత్‌ కౌర్‌, దీపికా, అన్ను, బ్యూటీ దుంగ్‌దుంగ్‌, లాల్‌రెమ్సియామి, ముంతాజ్‌ ఖాన్ వ్యవహరించనున్నారు.

ఈ సిరీస్‌ భారత జట్టుకు హాకీ వరల్డ్‌ కప్‌ 2026, ఆసియా గేమ్స్‌కు ముందు కీలకమైందిగా పరిగణించబడుతుంది. అర్జెంటీనా వంటి బలమైన జట్టుతో ఆడటం యువ ప్లేయర్లకు విలువైన అనుభవంగా నిలువనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement