‘ధోనికి ఇప్పుడంత సీన్‌ లేదు.. ఒత్తిడిలోనూ నావి సరైన నిర్ణయాలే’ | Klassen working with eye doctor improve game Gives verdict on Dhoni | Sakshi
Sakshi News home page

‘ధోనికి ఇప్పుడంత సీన్‌ లేదు.. ఒత్తిడిలోనూ నావి సరైన నిర్ణయాలే’

Apr 8 2026 4:00 PM | Updated on Apr 8 2026 4:28 PM

Klassen working with eye doctor improve game Gives verdict on Dhoni

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఒత్తిడిలోనూ తాను సరైన నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఓ కంటి డాక్టర్‌ ఉన్నారన్నాడు. ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్‌ తరఫున నిలకడైన బ్యాటర్‌గా క్లాసెన్‌ కొనసాగుతున్నాడు.

రెండు హాఫ్‌ సెంచరీలు
గతంలో వికెట్‌ కీపర్‌గానూ సేవలు అందించిన క్లాసెన్‌కు.. ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) రాకతో ఈ బాధ్యతల నుంచి విముక్తి లభించింది. ఇక ఈసారి నాలుగు లేదంటే ఐదో స్థానంలోనే అతడు బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లలో వరుసగా 31, 52, 62 పరుగులు సాధించాడు.

కాగా సౌతాఫ్రికాకు చెందిన క్లాసెన్‌ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తాను విజయవంతమైన, నిలకడైన ఆటగాడిగా కొనసాగడం వెనుక కంటి డాక్టర్‌ ఉన్నారని క్లాసెన్‌ తాజాగా వెల్లడించాడు. ఈ మేరకు స్పోర్ట్స్‌స్టార్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

ఒత్తిడిలో ఉన్నప్పటికీ సరైన నిర్ణయాలు
‘‘కేప్‌టౌన్‌లో షెరిల్లీ అనే పేరు గల కంటి డాక్టర్‌ సూచనలతో నన్ను నేను మెరుగుపరచుకునే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ మేము దీనిని EyeGym అని పిలుస్తాము. ఒత్తిడిలో ఉన్నప్పటికీ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇది ఉపయోగపడుతుంది.

గత ఏడాది కాలంగా నాకు ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగింది. ఏ విషయంలోనైనా త్వరితగతిన స్పందించి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను’’ అని హెన్రిచ్‌ క్లాసెన్‌ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్‌ ఒక్కటి మాత్రమే గెలిచింది. తదుపరి చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో శనివారం తలపడనుంది. ఈ నేపథ్యంలో సీఎస్‌కే దిగ్గజం, గాయం వల్ల ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన మహేంద్ర సింగ్‌ ధోని గురించి ప్రస్తావన రాగా..

ధోనికి ఇప్పుడంత సీన్‌ లేదు
‘‘సాధారణంగా అతడు మైదానంలోకి వస్తున్నాడంటే ప్రేక్షకుల నుంచి స్పందన కారణంగా మనం చుట్టుపక్కల ఏం జరుగుతుందో వినలేము. అయితే, ఈసారి అతడు లేడు కాబట్టి ప్రేక్షకులు కాస్త నిశ్శబ్దంగానే ఉంటారు.

అది మాకు కలిసి వస్తుంది. అయితే, కెప్టెన్‌గా ధోని గతేడాది కాస్తైనా ప్రభావం చూపినా ఆటగాడిగా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. కేవలం ఐదు నుంచి పది బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. కాబట్టి ఒకవేళ ఈసారి కూడా జట్టుతో ఉన్నా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు’’ అని క్లాసెన్‌ అభిప్రాయపడ్డాడు.

చదవండి: PSL: ‘దుప్పటి, దిండు తెచ్చుకుని ఇక్కడే నిద్రపోవాల్సింది’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement