CSK vs SRH
-
ఇంటికెళ్లి విజిల్ వేసుకోండి.. ఇషాన్ కిషన్ మాస్ ర్యాగింగ్
-
హార్దిక్ రికార్డు బద్దలు కొట్టిన కమిన్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి ప్యాట్ కమిన్స్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో కెప్టెన్ హోదాలో అత్యధిక వికెట్లు పడగొట్టిన పేస్ బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ ప్రస్తుత సారథి హార్దిక్ పాండ్యా పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు.వెన్నునొప్పి కారణంగా ఆస్ట్రేలియా టెస్టు సారథి కమిన్స్ (Pat Cummins).. ఐపీఎల్-2026 ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. అతడి గైర్హాజరీలో ఇషాన్ కిషన్ జట్టును ముందుకు నడిపించి విజయపథంలో నిలిపాడు.మూడు కీలక వికెట్లు పడగొట్టిఈ క్రమంలో రాజస్తాన్ రాయల్స్‌తో ఏప్రిల్ 25 నాటి మ్యాచ్ సందర్భంగా కమిన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా పునరాగమనం చేశాడు. అప్పటి నుంచి పొదుపుగా బౌలింగ్ చేస్తూ అలరించిన కమిన్స్.. చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం నాటి కీలక మ్యాచ్‌లో అద్భుత రీతిలో రాణించాడు.చెపాక్ వేదికగా చెన్నై ఓపెనర్లు సంజూ శాంసన్ (27), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (15)లతో పాటు.. మరో కీలక బ్యాటర్ కార్తిక్ శర్మ (32) రూపంలో మూడు వికెట్లు పడగొట్టాడు కమిన్స్. తద్వారా ఈ సీజన్లో ఇప్పటికి ఆరు మ్యాచ్‌లలో కలిపి ఎనిమిది వికెట్లు పూర్తి చేసుకున్నాడు.హార్దిక్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలుఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ఆల్‌టైమ్ రికార్డును కమిన్స్ బద్దలు కొట్టాడు. కెప్టెన్ హోదాలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ ఐపీఎల్లో ఇప్పటికి.. 40 వికెట్లు తీయగా.. కమిన్స్ తాజాగా అతడిని అధిగమించాడు. అంతేకాదు ఈ సందర్భంగా టీ20 క్రికెట్లో 200 వికెట్ల మైలురాయికి చేరుకున్నాడు.ఇదిలా ఉంటే.. సారథిగా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆసీస్ దివంగత స్పిన్ దిగ్గజం, రాజస్తాన్ రాయల్స్ మాజీ కెప్టెన్ షేన్ వార్న్ కొనసాగుతున్నాడు. ఇక చెన్నైని ఐదు వికెట్ల తేడాతో ఓడించిన సన్‌రైజర్స్.. ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.A sudden Sunrise in the Chepauk night sky! 🌅🎥 #SRH bounce back with 2️⃣ wickets 👊Updates ▶️ https://t.co/4SxAzYKEvY#TATAIPL | #KhelBindaas | #CSKvSRH | @SunRisers pic.twitter.com/dQm1miLW5i— IndianPremierLeague (@IPL) May 18, 2026ఐపీఎల్లో కెప్టెన్ హోదాలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు👉షేన్ వార్న్ (స్పిన్నర్)- రాజస్తాన్ రాయల్స్- 55 మ్యాచ్‌లలో 58 వికెట్లు👉ప్యాట్ కమిన్స్ (పేసర్)- సన్‌రైజర్స్ హైదరాబాద్- 36 మ్యాచ్‌లలో 42 వికెట్లు👉హార్దిక్ పాండ్యా (పేసర్)- గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్- 68 మ్యాచ్‌లలో 40 వికెట్లు👉అనిల్ కుంబ్లే (స్పిన్నర్)- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 26 మ్యాచ్‌లలో 30 వికెట్లు👉రవిచంద్రన్ అశ్విన్ (స్పిన్నర్)- కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (పంజాబ్ కింగ్స్)- 28 మ్యాచ్‌లలో 20 వికెట్లు.చదవండి: సంజూను అసభ్యంగా దూషించిన క్లాసెన్!.. వీడియో వైరల్ -
సంజూతో గొడవపడ్డ క్లాసెన్!.. చర్యలు తప్పవా?
మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్-2026 ‘ప్లే ఆఫ్స్’లో అడుగుపెట్టింది. చెపాక్ వేదికగా సోమవారం జరిగిన పోరులో 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి.. టాప్-4 బెర్తును ఖరారు చేసుకుంది. అంతేకాదు తమతో పాటు గుజరాత్ టైటాన్స్‌ను కూడా ‘ప్లే ఆఫ్స్’కు చేర్చింది.ఇక ఈ సీజన్లో ముందుగా డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ ముందుగా బెర్తు ఖాయం చేసుకోగా.. ఇప్పుడు మిగిలిన మరో స్థానం కోసం పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ జట్లు రేసులో ఉన్నాయి. సహనం కోల్పోయిన క్లాసెన్ఇదిలా ఉంటే.. చెన్నైతో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ సహనం కోల్పోయాడు. మెరుపు వేగంతో తనను స్టంపౌట్ చేసిన చెన్నై వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను అసభ్యంగా దూషించాడు.Sanju Samson ಕಡೆಯಿಂದ Dhoni-level stumping! 🔥🤯ವೀಕ್ಷಿಸಿ | Race to Playoffs 👉 #CSKvsSRH | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ. #TATAIPL pic.twitter.com/v9uADWD2YG— Star Sports Kannada (@StarSportsKan) May 18, 2026180 పరుగులుసొంతమైదానంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (27 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), కార్తీక్ శర్మ (19 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు.అనంతరం హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, హెన్రిచ్ క్లాసెన్ (26 బంతుల్లో 47; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించాడు.మెరుపు వేగంతోఅయితే, జోరు మీదున్న క్లాసెన్‌ను చెన్నై బౌలర్ నూర్ అహ్మద్.. తన స్పిన్ మాయాజాలంతో ట్రాప్ చేశాడు. పదిహేనో ఓవర్లో అతడు సంధించిన మూడో బంతిని ఆడటంలో క్లాసెన్ విఫలమయ్యాడు. ఇంతలో బంతిని అందుకున్న వికెట్ కీపర్ సంజూ.. ధోనిని గుర్తుచేస్తూ మెరుపు వేగంతో స్టంప్స్ గిరాటేశాడు.Heated argument between sanju and klaseen #cskvssrh#sanjusamson#HeinrichKlaasen pic.twitter.com/A2noDYjGk9— NOTHING (@Nothing_il9zO) May 18, 2026సంజూను దూషించిన క్లాసెన్!ఈ క్రమంలో రీప్లేలో క్లాసెన్ కాలు గాల్లో ఉన్నట్లుగా తేలడంతో అతడు అవుటయ్యాడు. దీంతో సంజూ, నూర్ సంబరాలు చేసుకోగా.. క్లాసెన్ కోపంగా సంజూను దూషించినట్లు కనపడింది. సంజూ కూడా బదులిచ్చేందుకు రాగా.. నూర్ సైతం క్లాసెన్ పైకి వెళ్లాడు. ఇంతలో శివం దూబే, ఫీల్డ్ అంపైర్లు వచ్చి ఇరు వర్గాలను విడదీయడంతో పరిస్థితి సద్దుమణిగింది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. క్లాసెన్ ప్రవర్తన పట్ల విమర్శలు వస్తున్నాయి. సీనియర్ ప్లేయర్ నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదంటూ నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. కాగా ఈ ఘటన నేపథ్యంలో క్లాసెన్‌ను బీసీసీఐ మందలించే అవకాశం ఉంది. చదవండి: నా శరీరం బలహీనంగా ఉంది: ధోని అభిమానుల హృదయం ముక్కలు -
సీఎస్కే చెత్త రికార్డు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 18) రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 10 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (59), క్లాసెన్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ (3-0-22-3), జేమీ ఓవర్టన్ (4-0-37-3), ముకేశ్ చౌదరి (2-0-21-2), గుర్జప్నీత్ సింగ్ (4-0-34-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు.అనంతరం బరిలోకి దిగిన సీఎస్కే ఓ దశ వరకు సునాయాసంగా గెలిచేలా కనిపించినా, చివరికి అనూహ్యంగా ఓటమిపాలైంది. ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి సీఎస్కే గెలుపును అడ్డుకున్నారు. ముఖ్యంగా ఎషాన్ మలింగ (4-0-29-3), నితీశ్ కుమార్ రెడ్డి (4-0-31-2) సీఎస్కేకు అడ్డుకట్ట వేశారు. సాకిబ్ హుస్సేన్ (4-0-32-1), శివాంగ్ కుమార్ (3-0-18-1) కూడా పర్వాలేదనిపించారు. వీరి ధాటికి సీఎస్కే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీఎస్కే ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. 34 పరుగులు చేసిన మాథ్యూ షార్ట్ ఆ జట్టులో టాప్ స్కోరర్.హ్యాట్రిక్ ఓటములు, రెండు వరుస విజయాల తర్వాత సీఎస్కే మూటగట్టుకున్న మరో ఓటమి ఇది. ఈ ఓటమితో సీఎస్కే పలు చెత్త రికార్డులను సొంతం చేసుకుంది.2019 తర్వాత ఆ జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా 180 ప్లస్ టార్గెట్‌ను ఛేదించలేదు. 14 ప్రయత్నాల్లో ఓటమినే చవిచూసింది. సీఎస్కే చివరిసారిగా 180 ప్లస్ టార్గెట్‌ను 2018 సీజన్లో ఇదే ఎస్ఆర్హెచ్పై ఛేదించింది.ఇది కాక సీఎస్కే మరో చెత్త రికార్డును కూడా కొనసాగించింది. నిన్న ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ జరిగిన వేదికపై (హైదరాబాద్‌లో ఉప్పల్ స్టేడియం) సీఎస్కే ఎనిమిదేళ్లుగా ఒక్క గెలుపూ నమోదు చేయలేదు. ఈ వేదికపై సీఎస్కేకు అతి చెత్త రికార్డు ఉంది. కాగా, నిన్నటి పరాజయం తర్వాత సీఎస్కే పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉండగా.. ఎస్ఆర్హెచ్ నాలుగో స్థానానికి ఎగబాకింది. -
ప్లాన్ ప్రకారం చేస్తున్నారు: ఇషాన్ కిషన్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 18) రాత్రి జరిగిన మ్యాచ్‌లో సీఎస్కేపై సన్‌రైజర్స్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను బౌలర్లు గెలిపించారు. తొలుత బ్యాటింగ్ చేసి 194 పరుగులు చేసిన సన్‌రైజర్స్, ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఎషాన్ మలింగ (4-0-29-3), నితీశ్ కుమార్ రెడ్డి (4-0-31-2), సాకిబ్ హుస్సేన్ (4-0-32-1), శివాంగ్ కుమార్ (3-0-18-1) అద్భుతంగా బౌలింగ్ చేసి సీఎస్కేను గెలుపును అడ్డుకున్నారు.మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తమ బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇషాన్ మాటల్లో..యువ బౌలర్లు ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేస్తున్నారు. వారు తమ ప్లాన్లను అమలు చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. వారు స్వయంగా ప్లాన్లు తయారు చేసుకోవడంతో కెప్టెన్‌గా ఫీల్డ్ సెట్ చేయడంలో ఒత్తిడి తగ్గింది. ప్రాక్టీస్ సెషన్స్‌లో వారు కష్టపడి మెరుగుపడుతున్నారు. అందుకే వారిపై పూర్తి నమ్మకం ఉంచి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము.బ్యాటింగ్‌లో లోటుపై మాట్లాడుతూ.. అభిషేక్ శర్మ త్వరగా ఔట్ కావడంతో 20–30 పరుగులు తక్కువ చేశామని అనిపించింది. సాధారణంగా మా టాప్-3లో ఒకరు పెద్ద స్కోరు చేస్తారు. కానీ ఈ మ్యాచ్‌లో అది జరగలేదు. పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండింది. కాబట్టి 220–230 పరుగులు చేసి ఉండవచ్చు.పాయింట్స్ టేబుల్‌పై మాట్లాడుతూ.. మేము పాయింట్స్ టేబుల్ గురించి ఆలోచించడం లేదు. ఇది చాలా సుదీర్ఘమైన టోర్నీమెంట్. ఏ మ్యాచ్‌కు ఆ మ్యాచ్‌ను టార్గెట్‌గా పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాము. ప్రతి మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ, అగ్రెసివ్‌గా ఆడటమే మా కర్తవ్యం.ఇషాన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. బౌలర్ల ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు స్పష్టమైంది. అలాగే బ్యాటింగ్‌లో మరిన్ని పరుగులు సాధించాలనే ఉద్దేశం బయటపడింది. మొత్తంగా జట్టు ప్రదర్శన పట్ల ఇషాన్ సంతోషంగా ఉన్నారు. ఈ గెలుపు తర్వాత సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఏప్రిల్ 21న జరిగే తదుపరి మ్యాచ్‌లో ఈ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కూడా ఎస్ఆర్హెచ్ సొంత మైదానం హైదరాబాద్‌లోనే జరుగనుంది. -
‘ధోనికి ఇప్పుడంత సీన్ లేదు.. ఒత్తిడిలోనూ నావి సరైన నిర్ణయాలే’
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ హెన్రిచ్ క్లాసెన్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఒత్తిడిలోనూ తాను సరైన నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఓ కంటి డాక్టర్ ఉన్నారన్నాడు. ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ తరఫున నిలకడైన బ్యాటర్‌గా క్లాసెన్ కొనసాగుతున్నాడు.రెండు హాఫ్ సెంచరీలుగతంలో వికెట్ కీపర్‌గానూ సేవలు అందించిన క్లాసెన్‌కు.. ఇషాన్ కిషన్ (Ishan Kishan) రాకతో ఈ బాధ్యతల నుంచి విముక్తి లభించింది. ఇక ఈసారి నాలుగు లేదంటే ఐదో స్థానంలోనే అతడు బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లలో వరుసగా 31, 52, 62 పరుగులు సాధించాడు.కాగా సౌతాఫ్రికాకు చెందిన క్లాసెన్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తాను విజయవంతమైన, నిలకడైన ఆటగాడిగా కొనసాగడం వెనుక కంటి డాక్టర్ ఉన్నారని క్లాసెన్ తాజాగా వెల్లడించాడు. ఈ మేరకు స్పోర్ట్స్‌స్టార్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఒత్తిడిలో ఉన్నప్పటికీ సరైన నిర్ణయాలు‘‘కేప్‌టౌన్‌లో షెరిల్లీ అనే పేరు గల కంటి డాక్టర్ సూచనలతో నన్ను నేను మెరుగుపరచుకునే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ మేము దీనిని EyeGym అని పిలుస్తాము. ఒత్తిడిలో ఉన్నప్పటికీ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇది ఉపయోగపడుతుంది.గత ఏడాది కాలంగా నాకు ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగింది. ఏ విషయంలోనైనా త్వరితగతిన స్పందించి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను’’ అని హెన్రిచ్ క్లాసెన్ చెప్పుకొచ్చాడు.ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ ఒక్కటి మాత్రమే గెలిచింది. తదుపరి చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం తలపడనుంది. ఈ నేపథ్యంలో సీఎస్కే దిగ్గజం, గాయం వల్ల ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రస్తావన రాగా..ధోనికి ఇప్పుడంత సీన్ లేదు‘‘సాధారణంగా అతడు మైదానంలోకి వస్తున్నాడంటే ప్రేక్షకుల నుంచి స్పందన కారణంగా మనం చుట్టుపక్కల ఏం జరుగుతుందో వినలేము. అయితే, ఈసారి అతడు లేడు కాబట్టి ప్రేక్షకులు కాస్త నిశ్శబ్దంగానే ఉంటారు.అది మాకు కలిసి వస్తుంది. అయితే, కెప్టెన్‌గా ధోని గతేడాది కాస్తైనా ప్రభావం చూపినా ఆటగాడిగా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. కేవలం ఐదు నుంచి పది బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. కాబట్టి ఒకవేళ ఈసారి కూడా జట్టుతో ఉన్నా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు’’ అని క్లాసెన్ అభిప్రాయపడ్డాడు.చదవండి: PSL: ‘దుప్పటి, దిండు తెచ్చుకుని ఇక్కడే నిద్రపోవాల్సింది’


