T20 WC 2022: సామ్‌ కరన్‌ అరుదైన రికార్డు.. ఇంగ్లండ్‌ తొలి బౌలర్‌గా

Sam Curran 1st Bowler Most-Wkts For England T20 World Cup - Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ అరుదైన రికార్డు అందుకున్నాడు. టి20 ప్రపంచకప్‌లలో ఇంగ్లండ్‌ తరపున అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. తాజాగా పాకిస్తాన్‌తో జరుగుతున్న ఫైనల్లో మహ్మద్‌ రిజ్వాన్‌ను ఔట్‌ చేయడం ద్వారా సామ్‌ కరన్‌ ఈ ప్రపంచకప్‌లో 11వ వికెట్‌ సాధించాడు. సామ్‌ కరన్‌ తర్వాత వరుసగా రియాన్‌ సైడ్‌బాటమ్‌(10 వికెట్లు, 2010), గ్రేమ్‌ స్వాన్‌(10 వికెట్లు, 2010), డేవిడ్‌ విల్లే(10 వికెట్లు, 2016) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ తడబడుతుంది. 13 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్‌ 4 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. బాబర్‌ ఆజం 32 పరుగులు చేసి ఔట్‌ కాగా.. షాన్‌ మసూద్‌ 23 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

చదవండి: Pak Vs Eng: చరిత్ర పునరావృతం కాబోతోంది.. ట్రోఫీ గెలుస్తాం: బాబర్‌ ఆజం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top