SA Vs AUS: ఆస్ట్రేలియా క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి | SA Vs AUS 1st Test Makes History, Becomes Only The 5th Match Featuring An All 30 Plus Playing XI, Check More Details | Sakshi
Sakshi News home page

SA Vs AUS: ఆస్ట్రేలియా క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి

Oct 9 2026 2:43 PM | Updated on Oct 9 2026 2:57 PM

SA vs AUS 1st Test Creates History Becomes Only 5th Match To

సౌతాఫ్రికా కెప్టెన్‌ బవుమాతో ఆసీస్‌ సారథి కమిన్స్‌ (PC: CSA X)

ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు.. దక్షిణాఫ్రికా గడ్డ మీద తొలిసారి టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య డర్బన్‌లోని కింగ్స్‌మేడ్‌ మైదానంలో శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన పర్యాటక ఆసీస్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

అరుదైన ఫీట్‌ 
ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా అరుదైన ఫీట్‌ నమోదు చేసింది. తమ క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారిగా ఓ టెస్టు మ్యాచ్‌లో.. తుదిజట్టు మొత్తంలో ముప్పై ఏళ్లకు పైబడిన ఆటగాళ్లకు చోటు ఇచ్చింది. ఓవరాల్‌గా క్రికెట్‌ చరిత్రలో టెస్టు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఇలా అందరూ వెటరన్‌ ఆటగాళ్లు ఉండటం ఇది ఐదోసారి.

మొట్టమొదటి సారిగా 1921లో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తమ తుదిజట్టులో 30 ప్లస్‌ ఏజ్‌ ఆటగాళ్లను బరిలోకి దించింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుత ఆసీస్‌ తుదిజట్టులో స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ (38 సంవత్సరాలు) అందరి కంటే పెద్ద వయస్కుడు కాగా.. అందరిలోకెల్లా మ్యాట్‌ రెన్షా (30) చిన్నవాడు.

టెస్టు మ్యాచ్‌ తుదిజట్టులో ముప్పై ఏళ్ల వయసు పైబడిన ఆటగాళ్లు ఉ‍న్న సందర్భాలు
👉ఇంగ్లండ్‌ జట్టులో- ఆస్ట్రేలియాతో లీడ్స్‌ మ్యాచ్‌లో (1921)
👉న్యూజిలాండ్‌ జట్టులో- పాకిస్తాన్‌తో కరాచీ మ్యాచ్‌లో (2022)
👉న్యూజిలాండ్‌ జట్టులో- పాకిస్తాన్‌తో కరాచీ మ్యాచ్‌లో (2023)
👉న్యూజిలాండ్‌ జట్టులో- ఇంగ్లండ్‌తో వెల్లింగ్‌టన్‌ మ్యాచ్‌లో (2023)
👉ఆస్ట్రేలియా జట్టులో- సౌతాఫ్రికాతో డర్బన్‌ మ్యాచ్‌లో (2026)

సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టు
ట్రవిస్‌ హెడ్‌ (32 ఏళ్లు), నిక్‌ మాడిసన్‌ (34 ఏళ్లు), మార్నస్‌ లబుషేన్‌ (32 ఏళ్లు), స్టీవ్‌ స్మిత్‌ (37 ఏళ్లు), మ్యాట్‌ రెన్షా (30 ఏళ్లు), అలెక్స్‌ క్యారీ (వికెట్‌ కీపర్‌- 35 ఏళ్లు), బ్యూ వెబ్‌స్టర్‌ (32 ఏళ్లు), ప్యాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌- 33 ఏళ్లు), మిచెల్‌ స్టార్క్‌ (36 ఏళ్లు), నాథన్‌ లియోన్‌ (38 ఏళ్లు), జోష్‌ హాజిల్‌వుడ్‌ (35 ఏళ్లు).

చదవండి: నన్ను సెలక్ట్‌ చేయడం ఇష్టం లేకుంటే మానెయ్‌.. ఉచిత సలహాలు ఇవ్వకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement