
టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. భారత టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్‌ను నియమిస్తూ బీసీసీఐ శనివారం ప్రకటన చేసింది. ఇకపై పూర్తి స్ధాయిలో రోహిత్ భారత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ క్రమంలోనే స్వదేశంలో శ్రీలంకతో జరిగే టెస్ట్, టీ20 సిరీస్‌లకు జట్టులను బీసీసీఐ ఎంపిక చేసింది. స్వదేశంలో శ్రీలంకతో భారత్ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. శ్రీలంకతో టెస్టులకు కెప్టెన్‌గా రోహిత్ ఎంపిక కాగా, వైస్ కెప్టెన్‌గా బూమ్రా నియమితుడయ్యాడు.
ఇక దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో ఓటమి తర్వాత భారత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తదుపరి టెస్ట్ కెప్టెన్‌గా ఎవరు ఎంపిక అవుతారని అంతా ఆతృతగా ఎదురు చుశారు. బీసీసీఐ ప్రకటనతో వారి నిరీక్షణకు తెరపడింది. కాగా ఇకపై రోహిత్ భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ వ్యవహరించనున్నాడు. గత ఏడాది టీ20, వన్డేల్లో భారత కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ చెపట్టిన సంగతి తెలిసిందే.
చదవండి: BPL 2022 Final: సునీల్ నరైన్ ఊచకోత.. సంబురాల్లో కేకేఆర్