Rohit Sharma Praises Prasidh Krishna And Bowlers After India Won In Ind Vs WI Series - Sakshi
Sakshi News home page

IND vs WI: "అత‌డు అద్భుత‌మైన బౌల‌ర్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి బౌలింగ్ స్పెల్ చూడలేదు""

Feb 10 2022 9:44 AM | Updated on Jun 9 2022 7:41 PM

Rohit Sharma Hails Prasidh Krishna After India Beat West Indies In 2nd ODI - Sakshi

అహ్మ‌దాబాద్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో 44 ప‌రుగుల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భార‌త పేస‌ర్ ప్రసిద్ధ్ కృష్ణ  నాలుగు వికెట్ల ప‌డ‌గొట్టి అద్భుతంగా రాణించాడు. ఈ నేప‌థ్యంలో ప్రసిద్ధ్ కృష్ణపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్ర‌శంస‌ల వ‌ర్షం క‌రిపించాడు. "ఈ సిరీస్ గెల‌వ‌డం మాకు మంచి అనుభూతిని క‌లిగించింది. మాకు ఈ మ్యాచ్‌లో కొన్ని స‌వాళ్లు ఎదుర‌య్యాయి. రాహుల్‌, సూర్య కూమార్ యాద‌వ్ మంచి  భాగస్వామ్యాన్ని నెల‌కొల్పారు.

చివ‌రికి గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోర్‌ను న‌మోదు చేశాం. మేము ఆ స్కోర్‌ను డిఫెండ్ చేయ‌గ‌ల‌మ‌ని భావించాం. మా బౌల‌ర్లు అదే చేసి చూపించారు. ఈ మ్యాచ్‌లో బౌల‌ర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ అద్భుత‌మైన పేస్‌తో విండీస్ బ్యాట‌ర్లు ముప్పు తిప్ప‌లు పెట్టాడు. నేను ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త పిచ్‌ల‌పై ఇలాంటి స్పెల్ చూడలేదు. ఇక సూర్య కూమార్ యాద‌వ్ గురించి మాట్లాడూతూ.. సూర్య మ‌రి కొంత స‌మ‌యం వెచ్చించవలసి ఉంటుంది. అత‌ను జ‌ట్టు నుంచి  ఏమి కోరుకుంటుందో అర్థం చేసుకోవాలి. ఆదే విధంగా మిడిల్ ఆర్డర్‌లో సూర్య అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు" అని రోహిత్ పేర్కొన్నాడు.

చద‌వండి: IPL 2022: 10 ఓవ‌ర్లు..12 ప‌రుగులు.. నాలుగు వికెట్లు.. వేలం భారీ ధ‌ర ప‌క్కా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement