Asia Cup 2022: 'శ్రీలంకతో మ్యాచ్‌కు అతడిని జట్టులోకి తీసుకురండి'

Ravichandran Ashwin should play against Srilanka says Saba Karim  - Sakshi

ఆసియాకప్‌-2022 సూపర్‌-4లో భాగంగా డూ ఆర్‌ డై  మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడేందుకు భారత్‌ సిద్దమైంది. ఈ మ్యాచ్‌ దుబాయ్‌ వేదికగా మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా భారత్‌ తమ సూపర్‌-4 తొలి మ్యాచ్‌లో పాక్‌ చేతిలో ఓటమి పాలవ్వడంతో ఈ మ్యాచ్‌ కీలకంగా మారింది.

భారత్‌ ఫైనల్‌కు చేరాలంటే వరుసగా శ్రీలంక, ఆఫ్గానిస్తాన్‌పై విజయం సాధించాలి. ఇక గత మ్యాచ్‌లో పాక్‌పై జట్టులో నాలుగు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా.. శ్రీలంకతో మ్యాచ్‌లో జట్టులో ఏమైనా మార్పులు చేస్తుందా లేదా అదే జట్టుతో ఆడుతోందా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

ఈ క్రమంలో శ్రీలంకతో కీలక పోరుకు టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌లో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని ఎంపిక చేయాలని భారత మాజీ క్రికెటర్‌ సబా కరీం సూచించాడు. కాగా ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటి వరకు అశ్విన్‌ కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు.

ఈ నేపథ్యంలో ఇండియా స్పోర్ట్స్‌ న్యూస్‌తో కరీం మాట్లాడుతూ.. శ్రీలంకతో జరిగే కీలక మ్యాచ్‌కు హుడా స్థానంలో అశ్విన్‌ను జట్టులోకి తీసుకోవాలి. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాతో కలిపి ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగాలి. అశ్విన్‌ అద్భుతమైన ఆఫ్‌ స్పిన్నర్‌. అతడికి కీలక సమయాల్లో వికెట్లు తీసే సత్తా ఉంది అని" కరీం పేర్కొన్నాడు.

శ్రీలంకతో మ్యాచ్‌కు భారత తుది జట్టు (అంచనా)..
కేఎల్‌ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్‌ కార్తీక్‌ (వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్‌ సింగ్
చదవండి: Asia Cup 2022: 'శ్రీలంకతో కీలక పోరు.. చాహల్‌ను పక్కన పెట్టి అతడిని తీసుకోండి'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top