IND vs SL: చరిత్ర సృష్టించిన అశ్విన్‌.. ప్రపంచంలో తొలి బౌలర్‌గా!

Ravichandran Ashwin First Player To Reach This Huge Milestone In World Test Championship - Sakshi

టీమిండియా స్పిన్నర్‌ రవి చంద్రన్‌ అశ్విన్‌ అరుదైన రికార్డు సాధించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్‌లో వంద వికెట్టు తీసిన తొలి బౌలర్‌గా అశ్విన్‌ రికార్డులకెక్కాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో 6 వికెట్లు పడగొట్టడంతో అశ్విన్‌ ఈ ఘనతను సాధించాడు. గత డబ్ల్యూటీసీ సైకిల్‌లో 71 వికెట్ల సాధించిన అశ్విన్‌.. డబ్ల్యూటీసీ 2021-23లో 29 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్‌లో  ఇప్పటి వరకు 21 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్‌ 100 వికెట్లు సాధించాడు. అదే విధంగా అశ్విన్ తర్వాత ఈ జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్ కమిన్స్ 20 టెస్టులలో 93 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు.

ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో అశ్విన్ ఆరో స్థానంలో ఉన్నాడు. 40 వికెట్లతో  జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక ఇదే మ్యాచ్‌లో కపిల్ దేవ్ తో పాటు డేల్ స్టెయిన్ (439 వికెట్లు) రికార్డులను కూడా అశ్విన్‌ బద్దలు కొట్టాడు. శ్రీలంక బ్యాటర్‌ ధనంజయ డిసిల్వాను ఔట్‌ చేయడం ద్వారా అశ్విన్‌ టెస్ట్‌ల్లో 440వ వికెట్‌ను పడగొట్టాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన 8వ బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు.

చదవండి: IPL 2022: హార్దిక్‌కు ఫిట్‌నెస్ టెస్ట్‌.. ఐపీఎల్‌కు దూరం కానున్నాడా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top