రాజస్థాన్‌లోకి షనక.. కీలక సూత్రధారి అతడే! | Rajasthan Royals Confirms Dasun Shanaka Joins Team With 2cr Base Price | Sakshi
Sakshi News home page

రాజస్థాన్‌లోకి షనక.. కీలక సూత్రధారి అతడే!

Mar 24 2026 11:59 AM | Updated on Mar 24 2026 12:28 PM

Rajasthan Royals Confirms Dasun Shanaka Joins Team With 2cr Base Price

న్యూఢిల్లీ: శ్రీలంక ఆల్‌రౌండర్‌ దసున్‌ షనక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ స్యామ్‌ కరన్‌ గాయంతో జట్టుకు దూరమవడంతో... అతడి స్థానంలో ఫ్రాంచైజీ షనకను ఎంపిక చేసుకుంది. షనకను రూ. 2 కోట్లకు రాజస్తాన్‌ తీసుకుంది. దీంతో అతడు పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) నుంచి తప్పుకొని ఐపీఎల్‌ ఆడనున్నాడు. 

ఇప్పటికే జింబాబ్వే బౌలర్‌ బ్లెస్సింగ్‌ ముజరబాని పీఎస్‌ఎల్‌ను వీడి ఐపీఎల్‌లో చేరగా... ఇప్పుడా జాబితాలో షనక చేరనున్నాడు. ఐపీఎల్‌ మినీ వేలంలో షనకను ఏ ఫ్రాంచైజీ తీసుకోక పోగా... పీఎస్‌ఎల్‌లో లాహోర్‌ ఖలందర్స్‌ జట్టు అతడిని ఎంపిక చేసుకుంది. ఇప్పుడు రాజస్తాన్‌ కోచ్‌ సంగక్కర ప్రోత్సాహంతో అతడు ఐపీఎల్‌లోకి రానున్నాడు. 

ఐపీఎల్‌లో బరిలోకి దిగడం షనకకిది రెండోసారి. 2023లో అతను గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు తరఫున మూడు మ్యాచ్‌లు ఆడాడు. ఇటీవల జరిగిన టి20 ప్రపంచకప్‌లో 34 ఏళ్ల షనక శ్రీలంక జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించాడు. శ్రీలంక తరఫున షనక ఇప్పటి వరకు 6 టెస్టులు, 71 వన్డేలు, 131 టి20 మ్యాచ్‌లు ఆడాడు.  

చదవండి: శతక్కొట్టిన జార్జియా వోల్‌.. సిరీస్‌ క్లీన్‌స్వీప్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement