నాదల్‌ ఖాతాలో 91వ సింగిల్స్‌ టైటిల్‌  | Rafael Nadal wins fourth title in Mexican Open | Sakshi
Sakshi News home page

Rafael Nadal: నాదల్‌ ఖాతాలో 91వ సింగిల్స్‌ టైటిల్‌ 

Feb 28 2022 7:56 AM | Updated on Feb 28 2022 7:57 AM

Rafael Nadal wins fourth title in Mexican Open - Sakshi

ఈ ఏడాది వరుసగా 15వ విజయం నమోదు చేసిన  స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రఫెల్ నాదల్ మెక్సికో ఓపెన్‌లో నాలుగోసారి టైటిల్‌ దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో నాదల్‌ 6–4, 6–4తో కామెరాన్‌ నోరీ (బ్రిటన్‌)పై గెలిచాడు. చాంపియన్‌ నాదల్‌కు 3,14,455 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 కోట్ల 36 లక్షలు)తోపాటు 500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. నాదల్‌ కెరీర్‌లో ఇది 91వ సింగిల్స్‌ టైటిల్‌కాగా... ఈ ఏడాది మూడోది. మెల్‌బోర్న్‌ ఓపెన్, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లోనూ నాదల్‌ విజేతగా నిలిచాడు.

చదవండి: Women’s World Cup 2022: ఫామ్‌లో లేదన్నారు... సెంచరీతో చెలరేగింది

Advertisement
 
Advertisement
Advertisement