ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు శశాంక్ సింగ్ మరోసారి ఫీల్డింగ్‌లో తీవ్రనిరాశపరిచాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు క్యాచ్‌లను జారవిడిచిన శశాంక్.. ఇప్పుడు అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై అదే తీరును కనబరిచాడు. కేఎల్ రాహుల్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను శశాంక్ విడిచిపెట్టాడు.
ఢిల్లీ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రాహుల్ ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి బంతి నేరుగా డీప్ స్వ్కెర్ లెగ్‌లో ఉన్న శశాంక్ సింగ్ చేతికి వెళ్లింది. కానీ అతడు సులువైన క్యాచ్‌ను జారవిడిచాడు. ఇందుకు పంజాబ్ కింగ్స్ భారీ మూల్యం చెల్లించుకుంది.
12 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రాహుల్.. భారీ సెంచరీతో కదం తొక్కాడు. రాహుల్ కేవలం 67 బంతుల్లో16 ఫోర్లు, 9 సిక్స్‌లతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు నితీష్ రాణా (44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 91) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక రాహుల్ క్యాచ్ విడిచిపెట్టిన శశాంక్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంత చెత్త ఫీల్డర్‌ను ఇప్పటివరకు చూడలేదు అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. శశాంక్ ఫీల్డింగ్ పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా, హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
— crictalk (@crictalk7) April 25, 2026


