మాజీ క్రికెటర్‌ ప్రవీణ్‌ ఆమ్రేకు కీలక పదవి

Pravin Amre Joins Delhi Capitals As Assistant Coach - Sakshi

ఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్‌ ప్రవీణ్‌ ఆమ్రే ఎంపికయ్యాడు. రాబోయే రెండు ఐపీఎల్‌ సీజన్లకు అతను సహాయ కోచ్‌గా కొనసాగనున్నట్లు ఢిల్లీ ఫ్రాంఛైజీ బుధవారం ప్రకటించింది. 2014-2019 మధ్య ఫ్రాంఛైజీ టాలెంట్‌ హెడ్‌గా పనిచేసిన 52ఏండ్ల ఆమ్రే..రికీ పాంటింగ్‌ నేతృత్వంలోని ప్రస్తుత కోచింగ్‌ సిబ్బందిలో చేరనున్నాడు. టీమ్‌ఇండియా తరఫున ఆమ్రే 11 టెస్టులు, 37 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్లో ఆటగాడిగా గొప్ప రాణించిన ఆమ్రే కోచింగ్‌ అనుభవం కూడా ఉంది. ముంబై మూడు రంజీ ట్రోఫీ టైటిళ్లు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.(చదవండి: ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top