To Play Against Virat Kohli: Pakistan Born USA Star On Ultimate Goal - Sakshi
Sakshi News home page

Shayan Jahangir: 'కోహ్లికి ప్రత్యర్థిగా ఆడటమే నా లక్ష్యం.. ఎదురుచూస్తున్నా'

Published Fri, Jun 23 2023 8:24 PM

To Play Against Virat Kohli: Pakistan born USA Star On Ultimate Goal - Sakshi

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, రన్‌మిషన్‌ విరాట్‌ కోహ్లి ప్రపంచక్రికెట్‌లో ఎంతో మంది యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచాడు. ఈ జాబితాలో మాజీ పాకిస్తాన్ అండర్-19 బ్యాటర్ షాయన్ జహంగీర్ కూడా ఉన్నాడు. జహంగీర్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సీనియర్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం జరగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ 2023 క్వాలిఫైయర్‌లో జహంగీర్ అద్బుతంగా రాణిస్తున్నాడు.

నేపాల్‌తో జరిగిన గ్రూపు-ఏ మ్యాచ్‌లో జహంగీర్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన జహంగీర్ 79 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆఖరి వరకు పోరాడనప్పటికీ అమెరికాకు మాత్రం విజయాన్ని అందించలేకపోయాడు. ఇక తన తొలి సెంచరీ అనంతరం జహంగీర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు.

"విరాట్‌ కోహ్లికి ప్రత్యర్థిగా ఆడటమే నా అంతిమ లక్ష్యం. టీమిండియాతో తలపడేందుకు ఇటువంటి మెగా టోర్నీల కోసం ఎదురు చూస్తుంటాను" అని మ్యాచ్ అనంతరం ఐసీసీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జహంగీర్ పేర్కొన్నాడు. కాగా గతంలో జహంగీర్.. ఇమామ్-ఉల్-హక్, హుస్సేన్ తలత్ వంటి ఆటగాళ్లతో పాకిస్తాన్‌ అండర్‌-19 జట్టులో భాగంగా ఉన్నాడు.

ఆ తర్వాత అమెరికాకు మకాం మార్చాడు. అతడు  అమెరికాకు వెళ్లే ముందు దేశీయ క్రికెట్‌లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ తరపున కూడా ఆడాడు. ఇక తన వన్డే కెరీర్‌లో ఇప్పటి వరకు 9 వన్డేలు ఆడిన అతడు 33.57 సగటుతో 235 పరుగులు చేశాడు.
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముం‍దు బీసీసీఐ కీలక నిర్ణయం..

Advertisement
 
Advertisement
 
Advertisement