AUS Vs WI: Pat Cummins Ruled Out, Steve Smith To Lead Australia In Second Test Against West Indies - Sakshi
Sakshi News home page

AUS Vs WI: వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్‌! కెప్టెన్‌ దూరం..

Dec 7 2022 2:14 PM | Updated on Dec 7 2022 3:35 PM

Pat Cummins ruled out, Steve Smith to lead Australia in second Test - Sakshi

వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ పాట్ కమిన్స్‌ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. తొలి టెస్టులో గాయపడిన  పాట్ కమిన్స్‌ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ క్రమంలో రెండో టెస్టులో అతడిని  ఆడించి రిస్క్ చేయకూడదని టీమ్ మేనేజ్‌మెంట్ భావించినట్లు తెలుస్తోంది.

ఇక రెండో టెస్టుకు పాట్ కమిన్స్‌ స్థానంలో ఆసీస్‌ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అదే విధంగా కమిన్స్‌ స్థానంలో స్కాట్ బోలాండ్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో 164 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ బ్యాటర్లు లబూషేన్‌, స్మిత్‌ డబుల్‌ సెంచరీలతో చెలరేగారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆడిలైడ్‌ వేదికగా డిసెంబర్‌ 8 నుంచి ప్రారంభం కానుంది.

రెండో టెస్టుకు ఆస్ట్రేలియా తుది జట్టు:  స్టీవ్ స్మిత్(కెప్టెన్‌), ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, మార్నస్ లాబుషేన్‌, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్‌ కీపర్‌), పాట్ కమిన్స్ (కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్‌వుడ్
చదవండి
: IND vs BAN: వారెవ్వా ఉమ్రాన్‌.. 151 కిమీ వేగంతో బౌలింగ్‌! బంగ్లా బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement