breaking news
Australia-West indies second test
-
వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్! కెప్టెన్ దూరం..
వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. తొలి టెస్టులో గాయపడిన పాట్ కమిన్స్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ క్రమంలో రెండో టెస్టులో అతడిని ఆడించి రిస్క్ చేయకూడదని టీమ్ మేనేజ్మెంట్ భావించినట్లు తెలుస్తోంది. ఇక రెండో టెస్టుకు పాట్ కమిన్స్ స్థానంలో ఆసీస్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అదే విధంగా కమిన్స్ స్థానంలో స్కాట్ బోలాండ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 164 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్లు లబూషేన్, స్మిత్ డబుల్ సెంచరీలతో చెలరేగారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆడిలైడ్ వేదికగా డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. రెండో టెస్టుకు ఆస్ట్రేలియా తుది జట్టు: స్టీవ్ స్మిత్(కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, మార్నస్ లాబుషేన్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్‌వుడ్ చదవండి: IND vs BAN: వారెవ్వా ఉమ్రాన్.. 151 కిమీ వేగంతో బౌలింగ్! బంగ్లా బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్ -
స్మిత్, వోగ్స్ సెంచరీలు
మెల్బోర్న్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 551/3 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్(134), వోగ్స్(106) సెంచరీలు సాధించారు. టెస్టుల్లో స్మిత్ కు ఇది 13 సెంచరీ కాగా, ఈ ఏడాదిలో ఆరోది. వోగ్స్ కు ఇది నాలుగో టెస్టు సెంచరీ కావడం గమనార్హం. 345/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ మరో వికెట్ నష్టపోకుండా 206 పరుగులు జోడించింది. తొలిరోజు ఆటలో వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖవాజా(144), ఓపెనర్ జో బర్న్స్(128) సెంచరీలు సాధించారు. నలుగుర బ్యాట్స్ మెన్లు సెంచరీలతో చెలరేగడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.