టోర్నీకి ఎంపిక చేయలేదని యువ క్రికెటర్‌ ఆత్మహత్యాయత్నం

Pakistan Domestic Cricketer Attempts Suicide After Not-Selected Tourney - Sakshi

దేశవాలీ టోర్నీకి ఎంపిక చేయలేదన్న కారణంతో ఒక క్రికెటర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. షోయబ్‌ అనే ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ సింద్‌ ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవలే పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఇంటర్‌ సిటీ చాంపియన్‌షిప్‌ను ప్లాన్‌ చేసింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాల క్రికెట్‌ బోర్డులను కోరింది. కాగా బోర్డులు కోచ్‌ల సలహా మేరకే ట్రయల్స్‌ను నిర్వహించి ఆపై జట్టును ఎంపిక చేస్తు‍న్నారు. ఈ క్రమంలోనే షోయబ్‌ను కోచ్‌ కనీసం బౌలింగ్‌ ట్రయల్‌ కూడా తీసుకెళ్లలేదు. దీంతో హైదరాబాద్‌ జట్టులో షోయబ్‌ పేరు గల్లంతయింది.

ఈ విషయం తెలుసుకొని తీవ్ర మనస్థాపం చెందిన షోయబ్‌ ఇంటికి వచ్చి బెడ్‌రూంకు వెళ్లి తలుపులేసుకున్నాడు. షోయబ్‌ కోపంగా రావడం చూసిన ఇంటి సభ్యులు బెడ్‌రూంకు వెళ్లి చూసే లోపలే షోయబ్‌ తన చేతిని బ్లేడ్‌తో పలుమార్లు కట్‌ చేసుకొని బాత్‌రూంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అతని కుటుంబసభ్యులు స్పందించారు.

''కోచ్‌ తనను బౌలింగ్‌ ట్రయల్స్‌ తీసుకెళ్లలేదని.. దీంతో జట్టుకు ఎంపిక కాలేకపోయాననే బాధతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. మేం వెళ్లి చూసేలోపే చేతి కట్‌ చేసుకొని బాత్‌రూంలో పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం షోయబ్‌ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని.. 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని వైద్యులు పేర్కొన్నట్లు'' తెలిపారు. అయితే పాకిస్తాన్‌ క్రికెట్‌లో ఇది కొత్తేం కాదు. ఇంతకముందు 2018లో అండర్‌-19 క్రికెటర్‌ ముహమ్మద్ జర్యాబ్ తనను జట్టులో నుంచి తీసేశారని ఉరి వేసుకొని ఆత్యహత్య చేసుకోవడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. 

చదవండి: కొడుకు బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయిన క్రికెటర్‌.. వీడియో వైరల్‌

'ఆ క్రికెటర్‌ యువ ఆటగాళ్లకు ఒక గుణపాఠం.. చూసి నేర్చుకొండి'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top