No MS Dhoni And Virat Kohli In Sachin Tendulkar All Time Best Team - Sakshi
Sakshi News home page

Sachin All Time Best Team: కోహ్లికి షాకిచ్చిన సచిన్.. ! 

Jan 6 2022 4:42 PM | Updated on Jan 6 2022 6:00 PM

No MS Dhoni And Virat Kohli In Sachin Tendulkar All Time Best Team - Sakshi

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌.. తన ఆల్‌ టైమ్‌ బెస్ట్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్‌ను ప్రకటించాడు. అయితే, ఈ జట్టులో భారత టెస్ట్‌ సారధి విరాట్‌ కోహ్లితో పాటు టీమిండియా మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిలకు స్థానం కల్పించకుండా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ ఇ‍ద్దరితో పాటు చాలా మంది దిగ్గజ క్రికెటర్లను విస్మరించిన లిటిల్‌ మాస్టర్‌.. తన జట్టులో తనకే చోటు కల్పించుకోకపోవడం విశేషం. 

ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్‌లను ఎంచుకున్న అతను.. వన్‌డౌన్‌లో బ్రియాన్ లారా, టూ డౌన్‌లో వివ్‌ రిచర్డ్స్, ఐదో స్థానంలో దిగ్గజ ఆల్‌రౌండర్‌ జాక్‌ కలిస్, ఆరో ప్లేస్‌లో సౌరవ్ గంగూలీ, వికెట్‌కీపర్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్, స్పిన్నర్ల కోటాలో హర్భజన్‌ సింగ్‌, షేన్ వార్న్‌, పేసర్లుగా వసీం అక్రమ్, గ్లెన్ మెక్‌గ్రాత్‌లను ఎంచుకున్నాడు. సచిన్.. తన డ్రీమ్‌ జట్టులో ద్రవిడ్, పాంటింగ్, మురళీధరన్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజాలకు కూడా చోటు కల్పించలేదు.

సచిన్ ఆల్‌టైం బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్: వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్, బ్రియాన్ లారా, వివ్‌ రిచర్డ్స్, సౌరవ్ గంగూలీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్, వసీం అక్రమ్, హర్భజన్ సింగ్, గ్లెన్ మెక్‌గ్రాత్
చదవండి: ఆర్సీబీ కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement