9 బంతుల్లో 44 పరుగులు.. 30 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించాడు!

New zealand wicket keeper batsman cam fletcher hit 52 runs in just 31 minutes and finish match in super smash - Sakshi

సూపర్‌ స్మాష్‌ లీగ్‌లో న్యూజిలాండ్‌ ఆటగాడు క్యామ్ ఫ్లెచర్ విద్వంసం సృష్టించాడు. సూపర్ స్మాష్‌లో భాగంగా ఆదివారం (డిసెంబర్‌19) వెల్లింగ్టన్ వర్సెస్‌ కాంట్రబరీ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వెల్లింగ్టన్ నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కాంట్రబరీ బౌలర్లలో మాట్ హెన్రీ, నట్టల్ చెరో మూడు వికెట్లు సాధించారు. అనంతరం 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కాంట్రబరీ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది.

ఇక ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన క్యామ్ ఫ్లెచర్ ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకు పడ్డాడు. 28 బంతులు ఎదుర్కొని అజేయంగా 52 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అయితే అతడు ఆడిన ఇన్నింగ్స్‌లో కేవలం 9 బంతుల్లోనే బౌండరీల రూపంలో 44 పరుగులు చేశాడు. కాగా  అతడు క్రీజులోకి వచ్చాక మ్యాచ్‌ను కేవలం 30 నిమిషాల్లోనే ముగించడం గమనర్హం. ఓపెనర్‌ చాడ్ బోడ్జ్ 41 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఇక ఫ్లెచర్ సుడిగాలి ఇన్నింగ్స్‌ ఫలితంగా కాంట్రబరీ 4 వికెట్లు కోల్పోయి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

చదవండి: SA Vs IND: భారత్‌ పర్యటన.. ఆ మ్యాచ్‌లను వాయిదా వేసిన దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top