IPL 2023 Mini Auction: 13 మంది ఆట‌గాళ్ల‌ను వ‌దులుకున్న ముంబై ఇండియ‌న్స్..

Mumbai Indians retained Players, released players - Sakshi

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఘోరమైన ప్రదర్శన కనబరిచిన ముంబై ఇండియన్స్‌.. ఐపీఎల్‌-2023లో సరికొత్తగా బరిలోకి దిగేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2023 మినీ వేలంకు ముందు ఏకంగా 13 మంది ఆటగాళ్లను ముంబై విడిచిపెట్టింది. విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితాను ముంబై ఇండియన్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది.

కాగా మినీ వేలం ముందు ఇంతమంది ఆటగాళ్లను ముంబై  రిలీజ్‌ చేయడం ఇదే తొలి సారి. అదే విధంగా ఈ ఏడాది సీజన్‌లో ఆర్‌సీబీ తరపున ఆడిన జాసన్ బెహ్రెండార్ఫ్‌ను ముంబై ట్రెడ్‌ చేసుకుంది. మరోవైపు వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ కీరాన్ పోలార్డ్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా ముంబై ఇండియన్స్‌ నియమించింది.  కాగా ఐపీఎల్‌కు పొలార్డ్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ముంబై ఇండియన్స్
రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లురోహిత్ శర్మ (కెప్టెన్‌), టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెండార్ఫ్ , ఆకాష్ మధ్వల్

విడిచిపెట్టిన ఆటగాళ్లు: కీరన్ పొలార్డ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్
చదవండి: IPL 2023: స్టార్‌ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్‌ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top