ఐపీఎల్-2026లో వరుస విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ టైటాన్స్‌తో ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో అక్షర్ సేన ఓటమి పాలైంది. తద్వారా ఈ సీజన్‌లో తొలి పరాజయాన్ని చవిచూసింది.
ఆఖరి ఓవర్లో హైడ్రామా
కాగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ- గుజరాత్ (DC vs GT) మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఢిల్లీ విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తమ పేసర్ ప్రసిద్ కృష్ణను బరిలోకి దించాడు. అతడి ఓవర్లో తొలి బంతికే విప్రాజ్ నిగమ్ ఫోర్ బాదాడు.
అయితే, మరుసటి బంతికే ప్రసిద్ విప్రాజ్‌ను అవుట్ చేసి ఢిల్లీ ఉత్సాహాన్ని నీరు గార్చాడు. దీంతో విజయ సమీకరణం మూడు బంతుల్లో 8 పరుగులుగా మారింది. ఆఖరి ఓవర్ మూడో బంతికి కుల్దీప్ యాదవ్ సింగిల్ తీసి స్ట్రైక్ డేవిడ్ మిల్లర్‌కు ఇచ్చాడు.
ఢిల్లీ కొంపముంచిన మిల్లర్
ఈ క్రమంలో నాలుగో బంతికి మిల్లర్ తనదైన శైలిలో సిక్సర్ బాదాడు. దీంతో ఢిల్లీ గెలుపు దాదాపు ఖరారైనట్లేనని అంతా భావించారు. కానీ ఆఖరి రెండు బంతుల్లో మిల్లర్ చేసిన తపు ఢిల్లీ కొంపముంచింది. రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరమైన సమయంలో.. ఐదో బంతికి మిల్లర్ సింగిల్ తీసేందుకు నిరాకరించాడు.
కుల్దీప్ బదులు తానే స్ట్రైక్‌లో ఉండాలని భావించాడు. అయితే, ఆఖర్లో ప్రసిద్ షార్ట్ బాల్ సంధించగా.. మిల్లర్ షాట్ ఆడటంలో విఫలమయ్యాడు. దీంతో సింగిల్‌కు యత్నించగా.. వికెట్ కీపర్ బట్లర్ బంతిని అందుకుని వికెట్లకు గిరాటేశాడు.
ఒక్క పరుగు తేడాతో
అయితే, అప్పటికి కుల్దీప్ క్రీజులోకి రాకపోవడంతో రనౌట్ అయ్యాడు. ఆ సమయంలో ఢిల్లీ వైడ్ కోసం రివ్యూ తీసుకోగా ప్రతికూల ఫలితం వచ్చింది. దీంతో ఒక్క పరుగు తేడాతో గెలిచిన గుజరాత్ సంబరాలు అంబరాన్నంటగా.. ఢిల్లీకి భంగపాటు ఎదురైంది.
ఈ నేపథ్యంలో డేవిడ్ మిల్లర్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఓటమి అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఎంతో సంయమనం పాటించాడు. మిల్లర్‌ను హత్తుకుని అతడిని ఓదార్చాడు. దీంతో అక్షర్ తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.
అతడి స్థానంలో వేరే కెప్టెన్ ఉండి ఉంటే గనుక పరిస్థితి వేరుగా ఉండేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఆఖరి వరకు పోరాడిన తీరు అద్భుతమంటూ ఢిల్లీ జట్టును కొనియాడుతున్నారు. కాగా ఇప్పటికి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో ఢిల్లీ రెండు గెలిచింది.
చదవండి: అతడు లేనిలోటు తీరనిది.. బ్యాటర్లే మా ఓటములకు కారణం: క్లాసెన్
Watch it yourself to believe it 🤯
A nerve-wrecking finish to a #TATAIPL classic 🥶 @gujarat_titans fans, you can breathe now 😅
Updates ▶️ https://t.co/oOdPR1oSeP#TATAIPL | #KhelBindaas | #DCvGT pic.twitter.com/Wh5EQvshqd— IndianPremierLeague (@IPL) April 8, 2026


