
క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ వ్యాఖ్యాతల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న వెస్టిండీస్ పేస్ దిగ్గజం మైకేల్ హోల్డింగ్ కామెంటరీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. గత 20 ఏళ్లుగా స్కై స్పోర్ట్స్‌కు హోల్డింగ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. నిష్పక్షపాతంగా తన అభిప్రాయాలు వెల్లడించడం, ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా నిజాయితీగా, లోతుగా తన విశ్లేషణను అందించడంలో అగ్రభాగాన నిలిచిన హోల్డింగ్ వ్యాఖ్యానం క్రికెట్ అభిమానులను సుదీర్ఘ కాలంగా ఆకట్టుకుంది.
చదవండి: ICC Mens T20I Rankings: టాప్- 10లో భారత్ నుంచి వాళ్లిద్దరే!