ఫించ్‌కు హోల్డింగ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Michael Holding Criticises England And Australia - Sakshi

ఆంటిగ్వా:  ప్రపంచ వ్యాప్తంగా ఏదొక చోట నల్ల జాతీయులపై దాడులు జరుగుతున్నా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్ల నుంచి మద్దతు కరువైందంటూ వెస్టిండీస్‌ దిగ్గజ బౌలర్‌, కామెంటేటర్‌ మైకేల్‌ హెల్డింగ్‌  ధ్వజమెత్తాడు. నల్ల జాతీయులపై జరుగుతున్న దాడులను ప్రస్తుతం ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లో క​నీసం లోగోల ద్వారా కూడా ఆ రెండు జట్ల నిరసించకపోవడాన్ని హోల్డింగ్‌ విమర్శించాడు. అంతకుముందు పాకిస్తాన్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన సిరీస్‌లో సైతం ఇదే విధానం కనిపించిందన్నాడు.

అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో ఇంగ్లండ్‌ బ్లాక్‌ లైవ్‌ మ్యాటర్స్‌’ లోగోలను ధరించి క్రికెట్‌ ఆడగా, ఇప్పుడు మాత్రం దానికి చరమగీతం పాడటం వెనుక అర్థం ఏమిటని ప్రశ్నించాడు. వెస్టిండీస్‌ ఇలా స్వదేశానికి వచ్చేయగానే బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్స్‌ అంశం​ ముగిసిపోయిందని అనుకుంటున్నారా అంటూ ఇంగ్లండ్‌-వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ)ని హోల్డింగ్‌ ప్రశ్నించాడు. ఇప్పుడు జరుగుతున్నది నలుపు-తెలుపు వ్యక్తుల పోరాటం కాదని, సమాన హక్కుల పోరాటమని గుర్తుంచుకోవాలన్నాడు. ఇది కేవలం అమెరికాకు మాత్రమే పరిమితమైన అంశం కాదన్నాడు.(చదవండి: పొలార్డ్‌ గ్యాంగ్‌పై షారుక్‌ ప్రశంసలు)

హోల్డింగ్‌ వ్యాఖ్యలపై ఈసీబీ స్పందించింది. ‘ బ్లాక్‌ లైవ్‌ మ్యాటర్స్‌’ అంశంలో మాది సుదీర్ఘమైన ప్రణాళిక. ఈ క్రమంలోనే మా దేశంలోని అన్ని ప్రాంతాల క్రికెట్‌లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాం. దానిపైనే ఫోకస్‌తో ముందుకు వెళుతున్నాం’ అని బదులిచ్చింది. ఇక దీనిపై ఆసీస్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ కూడా రిప్లై ఇచ్చాడు. ‘ఇప్పుడు జరుగుతున్న పోరాటం కంటే ఎడ్యుకేషన్‌ అనేది చాలా ముఖ్యం అని పేర్కొన్నాడు.  అదే సమయంలో ఏ ఒక్కరిపై వివక్ష లేని క్రీడలో ఉన్నందుకు సంతోషంగా ఉందంటూ ఫించ్‌ పేర్కొన్నాడు.

ఫించ్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌
ఇది కేవలం విద్య కోసం జరుగుతున్న పోరాటం మాత్రమే కాదు.  సమానత్వపు పోరాటంలో అవగాహనా ఉద్యమంతో పాటు ఎడ్యుకేషన్‌ కూడా ముఖ్యమే. జాతి, మతం, నీ వర్ణం నీ లింగం ఆధారంగా ఎవరూ నిషేధం విధింపబడలేని క్రీడలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని ఫించ్‌ అంటున్నాడు. ఫించ్‌ ప్రకటన ఏమిటో నాకు అర్థం కాలేదు. ఏ క్రీడలో వివక్ష లేదు. నీ ప్రకటన హాస్యాస్పదంగా ఉంది’ అంటూ హోల్డింగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. ఒకవేళ మీకు ఎవరికి నల్ల జాతీయుల ఉద్యమానికి మద్దతు అవసరం లేదనకుంటే మిమ్ముల్ని తానేమీ బలవంతంగా అందులోకి తీసుకెళ్లడానికి ఇక్కడ లేనన్నాడు. కానీ ఆచరణలో పెట్టలేని మాటలను మాట్లడవద్దన్నాడు.(చదవండి: ‘ఆ గన్‌ ప్లేయర్‌తో రైనా స్థానాన్ని పూడుస్తాం’)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top