Umran Malik IPL Records: బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన ఉమ్రాన్‌ మాలిక్‌

MI VS SRH: Umran Malik Breaks Bumrah Record - Sakshi

ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఓ ఐపీఎల్ సీజన్‌లో 20 అంత కంటే ఎక్కువ వికెట్లు తీసిన అతి పిన్న భారతీయ బౌలర్‌ (22 ఏళ్ల 176 రోజులు)గా రికార్డు సృష్టించాడు. 

ఉమ్రాన్‌కు ముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్‌ పేసర్‌ బుమ్రా పేరిట ఉండేది. 2017 ఐపీఎల్‌ సీజన్‌లో బుమ్రా 23 ఏళ్ల 165 రోజుల వయసులో 16 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టగా.. ప్రస్తుత సీజన్‌లో ఉమ్రాన్‌.. 13 మ్యాచ్‌ల్లోనే 21 వికెట్లు నేలకూల్చాడు. వీరిద్దరికి ముందు ఆర్పీ సింగ్ (23 ఏళ్ల 166 రోజులు) 2009లో, ప్రజ్ఞాన్ ఓజా (23 ఏళ్ల 222 రోజులు) 2010 సీజన్లలో ఈ ఘనత సాధించారు.

ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి(76) అర్ధశతకంతో రాణించగా.. ప్రియమ్ గార్గ్(42), నికోలస్ పూరన్(38) పర్వాలేదనిపించారు. అనంతరం ఛేదనలో ముంబై చివరి నిమిషం వరకు పోరాడి లక్ష్యానికి 3 పరుగుల దూరంలో (190/7) నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టిన ఉమ్రాన్ మాలిక్.. ప్రస్తుత సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. 
చదవండి: IPL 2022: అదరహో హైదరాబాద్‌.. ఉత్కంఠ పోరులో ముంబైపై విజయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

18-05-2022
May 18, 2022, 11:59 IST
15 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ముంబై ఇండియన్స్‌ తొలిసారి ఓ ఘోర అనుభవాన్ని ఎదుర్కొంది. నిన్న సన్‌రైజర్స్‌ చేతిలో పరాజయంతో...
18-05-2022
May 18, 2022, 11:15 IST
రాహుల్‌ త్రిపాఠిపై ఆకాశ్‌ చోప్రా ప్రశంసల జల్లు
18-05-2022
May 18, 2022, 11:15 IST
ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 194 పరుగల...
18-05-2022
May 18, 2022, 09:27 IST
టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ వెండితెరపై మెరువనున్నాడా అంటే.. అవుననే సమాధానమే వినబడుతుంది. సరదా కోసం టిక్‌ టాక్...
18-05-2022
May 18, 2022, 07:15 IST
ముంబై: ఓడితే ఐపీఎల్‌లో ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలు కోల్పోయే స్థితిలో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు సత్తా చాటింది....
17-05-2022
May 17, 2022, 22:36 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఆణిముత్యాల్లాంటి క్రికెటర్లు కొందరు లభించారు. తిలక్‌ వర్మ, ఆయుష్‌ బదోని, రింకూ సింగ్‌, శశాంక్‌ సింగ్‌...
17-05-2022
May 17, 2022, 20:14 IST
ఆర్‌సీబీ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ చేసిన ఒక పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సమ్మర్ సీజన్‌ అంటే ఎండలు...
17-05-2022
17-05-2022
May 17, 2022, 18:42 IST
ఆర్‌సీబీ మాజీ క్రికెటర్లు ఏబీ డివిలియర్స్‌,  క్రిస్‌ గేల్‌ను ఆ జట్టు యాజమాన్యం అరుదైన గౌరవంతో సత్కరించింది. ఆ జట్టు...
17-05-2022
May 17, 2022, 18:36 IST
తిలక్‌ వర్మపై టీమిండియా దిగ్గజం వ్యాఖ్యలు.. కానీ, ఇలా చేస్తేనే అంటూ సలహాలు!
17-05-2022
May 17, 2022, 17:23 IST
IPL 2022 Playoffs: కచ్చితంగా మనం ప్లే ఆఫ్స్‌నకు వెళ్తాం... కోల్‌కతాలో..
17-05-2022
May 17, 2022, 15:37 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా మంగళవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ ఔటైన తీరుపై టీమిండియా...
17-05-2022
May 17, 2022, 15:33 IST
IPL 2022- GT Teammates Video Viral: ఐపీఎల్‌ అరంగేట్ర సీజన్‌లోనే అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది గుజరాత్‌ టైటాన్స్‌. టీమిండియా...
17-05-2022
May 17, 2022, 14:23 IST
విలియమ్సన్‌ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్‌ ఘాటు వ్యాఖ్యలు
17-05-2022
May 17, 2022, 14:22 IST
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబాడ అరుదైన రికార్డు నెలకొల్పాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అత్యధిక వికెట్లు...
17-05-2022
May 17, 2022, 13:43 IST
ఐపీఎల్‌ 2022 ప్లే ఆఫ్స్‌ సమీకరణలు రసవత్తరంగా మారాయి. నిన్న (మే 16) పంజాబ్‌ను ఢిల్లీ మట్టికరిపించడంతో సమీకరణలు మారిపోయాయి....
17-05-2022
May 17, 2022, 13:07 IST
IPL 2022 MI Vs SRH: వరుసగా ఐదు పరాజయాలతో ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌...
17-05-2022
May 17, 2022, 13:04 IST
ఐపీఎల్‌-2022 చివరి అంకానికి చేరుకుంది. ఆయా జట్లు తమ అఖరి లీగ్‌ మ్యాచ్‌ల్లో తలపడతున్నాయి. కొన్ని జట్లు ప్లే ఆఫ్‌...
17-05-2022
May 17, 2022, 12:09 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా సోమవారం (మే 16) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 17 పరుగుల తేడాతో పరజాయం...
17-05-2022
May 17, 2022, 11:30 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా సోమవారం (మే 16) పంజాబ్‌ కింగ్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 17 పరుగుల తేడాతో... 

Read also in:
Back to Top