ఇంకోటి ఆడితే రికార్డు పుటల్లోకి... | LeBron James Closes in on Another Milestone | Sakshi
Sakshi News home page

ఇంకోటి ఆడితే రికార్డు పుటల్లోకి...

Mar 21 2026 3:46 AM | Updated on Mar 21 2026 3:46 AM

LeBron James Closes in on Another Milestone

మరో ఘనతకు చేరువగా లెబ్రాన్‌ జేమ్స్‌

మయామి: అమెరికా బాస్కెట్‌బాల్‌ దిగ్గజం, లాస్‌ఏంజెలిస్‌ లేకర్స్‌ జట్టు ప్లేయర్‌ లెబ్రాన్‌ జేమ్స్‌ తన కెరీర్‌లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకునేందుకు ఒక్క మ్యాచ్‌ దూరంలో ఉన్నాడు. విఖ్యాత నేషనల్‌ బాస్కెల్‌బాల్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ) లీగ్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా ఈ ఆదివారం 41 ఏళ్ల లెబ్రాన్‌ జేమ్స్‌ చరిత్ర సృష్టించనున్నాడు. 

79 ఏళ్ల ఎన్‌బీఏ చరిత్రలో వరుసగా 23 సీజన్‌లు ఆడిన ప్లేయర్‌గా... అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్‌గా గుర్తింపు పొందిన లెబ్రాన్‌ మయామి హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఈ క్రమంలో ఎన్‌బీలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా 1997 నుంచి రాబర్ట్‌ పారిశ్‌ (1611 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును లెబ్రాన్‌ సమం చేశాడు. మయామి హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో లెబ్రాన్‌ 19 పాయింట్లు స్కోరు చేశాడు. 

ఈ మ్యాచ్‌లో లాస్‌ఏంజెలిస్‌ లేకర్స్‌ జట్టు 134–126తో గెలిచి ఈ సీజన్‌లో వరుసగా ఎనిమిదో విజయాన్ని అందుకుంది. లాస్‌ఏంజెలిస్‌ లేకర్స్‌ జట్టు తదుపరి మ్యాచ్‌ను రేపు ఒర్లాండో మ్యాజిక్‌ జట్టుతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో లెబ్రాన్‌ బరిలోకి దిగితే ఎన్‌బీఏ చరిత్రలోనే అత్యధికంగా 1612 మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా ఘనత వహిస్తాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement