బ్యాట్‌లను రిపేర్‌ చేస్తున్న కోహ్లి.. | Kohli Interested In Taking Care Of His Bats | Sakshi
Sakshi News home page

తన బ్యాట్‌లను రిపేర్‌ చేస్తున్న కోహ్లి..

Sep 11 2020 4:46 PM | Updated on Sep 19 2020 3:36 PM

Kohli Interested In Taking Care Of His Bats - Sakshi

దుబాయ్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఏది చేసినా సంచలనమే. ఇటివల తరుచుగా తన అభిరుచులకు సంబంధించిన పోస్ట్‌లు పెడుతు తన ఫ్యాన్స్‌ను నిత్యం ఆకట్టుకుంటున్నాడు. అయితే తాజాగా తన బ్యాట్లను రిపేర్‌ చేస్తు నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగూళూరు టీమ్‌కు కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ అంశంపై విరాట్‌ స్పందిస్తూ బ్యాట్‌ హ్యాండిల్‌ బ్యాలెన్స్‌ కావడానికి కొద్దిగా కట్‌ చేశానని తెలిపాడు. ‌బ్యాట్‌ బ్యాలెన్స్‌ కోసం కొన్ని సెంటీమీటర్లైనా తనకు చాలా ముఖ్యమని పేర్కొన్నాడు.

తన బ్యాట్‌లంటే విపరీతమైన ప్రేమని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అయితే కోహ్లీ బ్యాట్ రిపేరింగ్ నైపుణ్యం తనను విపరీతంగా ఆకట్టుకుందని ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా తెలిపారు. తాను కూడా బ్యాట్‌లను రిపేర్‌ చేసే అవకాశం ఉంటే కచ్చితంగా కోహ్లిలా రిపేర్‌ చేస్తానని పేర్కొన్నాడు. యూఏఈలో సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ 2020 ప్రారంభమవుతుండగా, 21వ తేదీన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో రాయల్‌ చాలెంజర్స్ తలపడనుంది.‌ (చదవండి: మేమేంటో మా ఇద్దరికి మాత్రమే తెలుసు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement