
కెంట్: భారత లెఫ్టార్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ వచ్చే సీజన్‌లో ఐదు మ్యాచ్‌లలో ‘కెంట్’ కౌంటీకి ప్రాతినిధ్యం వహిస్తాడు. అర్షదీప్ భారత్ తరపున 3 వన్డేలు, 26 టి20ల్లో ఆడాడు.
భవిష్యత్తులో భారత టెస్టు జట్టులో అవకాశాల కోసం ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడమని, కౌంటీలు ఆడితే ప్రదర్శన మెరుగవుతుందని కోచ్ ద్రవిడ్ చేసిన సూచనతో అతను కౌంటీ క్రికెట్ వైపు వెళుతున్నాడు. అర్షదీప్.. కెంట్ తరఫున ఆడనున్న నాలుగో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు.