స్మోకింగ్‌ చేస్తూ పట్టుబడ్డ గుజరాత్‌ ప్లేయర్‌ | Kagiso Rabada Caught Smoking With GT Member; BCCI Action Incoming? | Sakshi
Sakshi News home page

సిగరెట్‌ కాలుస్తూ కెమెరా కంటికి చిక్కిన గుజరాత్‌ ప్లేయర్‌

Apr 22 2026 12:30 PM | Updated on Apr 22 2026 12:49 PM

Kagiso Rabada Caught Smoking With GT Member; BCCI Action Incoming?

గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ బౌలర్‌ కగిసో రబాడ వివాదంలో చిక్కుకున్నాడు. టీమ్‌ హోటల్‌ పరిసరాల్లో సిగరెట్‌ కాలుస్తూ కెమెరా కంటికి చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసి అభిమానులు రబాడపై చర్యలుంటాయా అని ఆరా తీస్తున్నారు.

ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌లో స్మోకింగ్‌పై స్పష్టమైన నిషేధం లేదు. అంటే సిగరెట్ తాగడం నిబంధనలకు వ్యతిరేకం కాదు. అయితే ఆటగాళ్ల ఫిట్‌నెస్, ప్రొఫెషనల్ ప్రవర్తన దృష్ట్యా ఇది విమర్శలకు దారి తీస్తోంది.

రబాడాకు డోపింగ్ ఉల్లంఘన నేపథ్యం ఉన్నందున ఈ ఘటనను బీసీసీఐ యాంటీ-డోపింగ్ విభాగం పరిశీలించే అవకాశం ఉంది. అతను వాడింది కేవలం సిగరెట్ మాత్రమేనా? లేక మరేదైనా నిషేధిత పదార్థమా? అన్నది నిర్ధారించాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో రబాడ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌టేకర్ల జాబితాలో ముందువరుసలో ఉన్నాడు. జట్టు విషయానికొస్తే.. గుజరాత్‌ ఈ సీజన్‌లో మధ్యస్త ప్రదర్శనలతో మమ అనిపిస్తుంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 3 అపజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement