ఇంగ్లండ్‌, ఆసీస్‌ మ్యాచ్‌ అంటేనే తొండి.. మరోసారి నిరూపితం

Jos Buttler Asks DRS But Umpire Adjudge Steve Smith-Out Save ENG Review - Sakshi

క్రికెట్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మ్యాచ్‌కు ఎనలేని క్రేజ్‌ ఉంటుంది. ఇరుజట్లు ఎక్కడ తలపడ్డా హోరాహోరీగా మ్యాచ్‌ జరగడం ఖాయం. అయితే అంతేస్థాయిలో తొండి కూడా జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా మంగళవారం ఇరుజట్ల​ మధ్య జరిగిన చివరి వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్మిత్‌ ఔట్‌ విషయంలో అంపైర్‌ తీసుకున్న నిర్ణయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

విషయంలోకి వెళితే.. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ఇబ్బందిగా కదిలిన స్టీవ్‌ స్మిత్‌ ఓలీ స్టోన్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి మిస్‌ చేశాడు. అయితే బంతి స్మిత్‌ గ్లోవ్స్‌ తాకుతూ కీపర్‌ బట్లర్‌ చేతుల్లో పడింది. అంతే బట్లర్‌ ఔట్‌ అంటూ అప్పీల్‌కు వెళ్లాడు. కానీ అంపైర్‌ మొదట ఔట్‌ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో బట్లర్‌ డీఆర్‌ఎస్‌ కోరుతూ టీ-సైన్‌ చూపించాడు.

ఇది గమనించిన అంపైర్‌ బట్లర్‌ నిర్ణయానికి మొగ్గుచూపుతూ తన వేలిని పైకి ఎత్తాడు. ఇది చూసిన స్మిత్‌ మొదట షాక్‌ అయినప్పటికి అంపైర్‌ నిర్ణయానికి కట్టుబడి పెవిలియన్‌ చేరాడు. దీనికి సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఇది చూసిన అభిమానులు కామెంట్స్‌ చేశారు. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌ అంటేనే తొండి.. ఇంగ్లండ్‌ రివ్యూను కాపాడేందుకు అంపైర్‌ స్మిత్‌ను ఔట్‌ ఇచ్చాడు.. ఇది చీటింగ్‌ అంటూ పేర్కొన్నారు.

చదవండి: IND VS NZ 3rd T20: పంత్‌.. ఇక మారవా..? ఇంకా ఎన్ని ఛాన్స్‌లు ఇవ్వాలి..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top