పాకిస్తాన్‌ మర్యాద తీసి పారేసిన గిల్లెస్పీ | Jason Gillespie Shames Pakistan's Stupidity After Joining Hyderabad Kingsmen | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ మర్యాద తీసి పారేసిన గిల్లెస్పీ

Mar 25 2026 8:13 PM | Updated on Mar 25 2026 8:32 PM

Jason Gillespie Shames Pakistan's Stupidity After Joining Hyderabad Kingsmen

ఆస్ట్రేలియా మాజీ స్పీడ్‌స్టర్‌ జేసన్‌ గిల్లెస్పీ పాకిస్తాన్‌ మర్యాద తీసి పారేశాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో కొత్తగా ఏర్పడిన హైదరాబాదు కింగ్స్‌మెన్ ఫ్రాంచైజీకి హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న అతను.. ఫ్రాంచైజీ తరఫున రూపొందించే వెల్కమ్ వీడియోలో పాల్గొనడానికి నిరాకరించారు. 

ఈ సంప్రదాయాన్ని ఆయన స్టుపిడ్‌ అని పిలుస్తూ పాక్‌ అభిమానులు, ఫ్రాంచైజీ యాజమాన్యం మనోభావాలను దెబ్బ తీశాడు. గిల్లెస్పీ నుంచి ఈ ఊహించని చర్యకు పాక్‌ క్రికెట్‌ అభిమానులు తొలుత షాక్‌ అయ్యారు. ఆతర్వాత ఫైరవవుతన్నారు.

వాస్తవానికి గిల్లెస్పీ ఇలా చేయడానికి కారణాలు లేకపోలేదు. గతంలో అతను పాక్‌ జాతీయ జట్టుకు కోచ్‌గా పని చేసినప్పుడు పీసీబీ వల్ల చాలా చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడు. అవి మనసులో పెట్టుకునే అతను ఇలా ప్రవర్తించి ఉంటాడని క్రికెట్‌ వర్గాలు అనుకుంటున్నాయి.

కాగా, కింగ్స్‌మెన్ ఫ్రాంచైజీ నిన్న తమ ఆటగాళ్లు మరియు సపోర్ట్ స్టాఫ్ కోసం సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో గిల్లెస్పీ కూడా కనిపించినప్పటికీ, హోటల్ లాబీకి రావడానికి ఆయన నిరాకరించారు. నాకు చాలా పని ఉంది. మీరు ఆ మూర్ఖమైన వీడియోలు తీయమని అంటున్నారు. నేను చేయను అని స్పష్టంగా చెప్పారు.  

ఇదిలా ఉంటే, హైదరాబాద్‌ కింగ్స్‌మెన్ మార్నస్ లాబుషేన్ నాయకత్వంలో మార్చి 26న లాహోర్ ఖలందర్స్‌తో తమ తొట్ట తొలి పీఎస్‌ఎల్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఇంధన సంక్షోభం కారణంగా PCB ఈ టోర్నీని పరిమిత వేదికలలో, ప్రేక్షకులు లేకుండా నిర్వహించనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement