ENG vs NZ: టెస్టు క్రికెట్‌లో ఆండర్సన్ అరుదైన ఫీట్‌.. మూడో బౌలర్‌గా..!

James Anderson Becomes Only Third Bowler To Achieve Rare Record In tests - Sakshi

ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్ ఆండర్సన్ టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో టామ్ లాథమ్‌ను ఔట్‌ చేసిన అండర్‌సన్‌.. తన కెరీర్‌లో 650వ టెస్టు వికెట్‌ని సాధించాడు. తద్వారా టెస్టుల్లో 650 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా అండర్‌సన్‌ రికార్డులెక్కాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో స్పిన్ దిగ్గజాలు షేన్ వార్న్, మురళీధరన్ తొలి రెండు స్ధానాల్లో ఉన్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 539 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్(145)‌, జో రూట్‌(176) పరుగులతో రాణించారు. అంతకుముందు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 553 పరుగులకు ఆలౌటైంది.  న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో మిచెల్‌(190),టామ్‌ బ్లండల్‌(106) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. 14 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కివీస్‌ 140 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి ఆడుతోంది.
చదవండి: Dilip Vengsarkar: టీమిండియాకి ఆడాలంటే ఇది సరిపోదా.. ఇంకా ఏం చేయాలి?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top