IPL Media Rights: ఐపీఎల్‌ ప్రసార హక్కులను దక్కించుకున్న సోనీ, వయాకామ్‌–18! ఒక్కో మ్యాచ్‌కు ఎంతంటే!

IPL Media rights sold for IN 44,025 crore - Sakshi

టీవీ ప్రసారహక్కులు రూ. 23,575 కోట్లు

డిజిటల్‌ ప్రసారహక్కులు రూ.20,500 కోట్లు

బీసీసీఐకి కాసుల పంట పండించిన ఐపీఎల్‌

ఐదేళ్లలో మొత్తం 410 మ్యాచ్‌లు 

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌... షేర్‌ మార్కెట్‌... గత రెండు దశాబ్దాల్లో భారత్‌లో ఏ రంగంలోనైనా ఇంత విలువ ఒక్కసారిగా పెరిగిందా అనేది సందేహమే! ఆరంభంలో మ్యాచ్‌కు రూ. 13.6 కోట్లు... పదేళ్ల తర్వాత మ్యాచ్‌కు రూ. 55 కోట్లు... మరో ఐదేళ్ల తర్వాత చూస్తే మ్యాచ్‌కు రూ.107.5 కోట్లు! క్రికెట్‌ అభిమానులకు అమిత వినోదాన్ని అందిస్తూ వస్తోన్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఇప్పుడు అంతులేని ఆదాయం తెచ్చి పెడుతూ కొత్త రికార్డులు కొల్లగొట్టింది.

ఫలితంగా బీసీసీఐ ఆర్జనలో మరో అతి పెద్ద అడుగు పడింది ... ఈ–వేలం ద్వారా లీగ్‌ ప్రసారహక్కుల కోసం నాలుగు ప్యాకేజీలు ప్రకటిస్తే రెండు ప్యాకేజీలకే ఇప్పటి వరకు బోర్డు ఖాతాలో రూ. 44,075 కోట్లు చేరాయి. మూడో ప్యాకేజీ వేలం ఇంకా కొనసాగుతుండగా, నాలుగో ప్యాకేజీ నుంచి కూడా తుది మొత్తం నేడు ఖరారవుతుంది. అయితే హక్కులను ఎవరు సొంతం చేసుకున్నారనే దానిపై ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు. టీవీ హక్కుల కోసం సోనీ, డిస్నీ స్టార్‌ తీవ్రంగా పోటీ పడగా... డిజిటల్‌ హక్కులు రిలయన్స్‌ సంస్థకు చెందిన ‘వయాకామ్‌–18’కు సొంతమైనట్లు వినిపిస్తోంది.  

ప్యాకేజీ ‘ఎ’: భారత ఉపఖండంలో టీవీ చానల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌ల ప్రసార హక్కులు (మొత్తం రూ. 23,575 కోట్లు; ఒక్కో మ్యాచ్‌కు రూ. 57.5 కోట్లు). 
ప్యాకేజీ ‘బి’: భారత ఉపఖండంలో డిజిటల్‌ (ఆన్‌లైన్‌) ఐపీఎల్‌ మ్యాచ్‌ల ప్రసార హక్కులు(మొత్తం రూ. 20,500 కోట్లు; మ్యాచ్‌కు రూ. 50 కోట్లు). 
ప్యాకేజీ ‘సి’: ఎంపిక చేసిన మ్యాచ్‌ల నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ డిజిటల్‌ హక్కులు. ప్యాకేజీ ‘బి’ గెలుచుకున్న సంస్థతో పాటు మరో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పై ప్రసారం చేసుకునే హక్కు (ఇప్పటికి సుమారు రూ. 2000 కోట్లు లభించాయి. వేలం నేడు కూడా కొనసాగుతుంది. ఒక్కో మ్యాచ్‌కు రూ. 18.4 కోట్లు చెల్లించే అవకాశం). 
ప్యాకేజీ ‘డి’: ఉపఖండం మినహా ఇతర దేశాల టీవీ, డిజిటల్‌ హక్కులు (వేలం జరగాల్సి ఉంది) 
ఐదేళ్లలో జరిగే మొత్తం ఐపీఎల్‌ మ్యాచ్‌లు 410 
నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ మ్యాచ్‌ల సంఖ్య (ప్యాకేజీ ‘సి’): 18+20+24 (నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ మ్యాచ్‌లు అంటే... ఆదివారాల సాయంత్రపు మ్యాచ్‌లు+ లీగ్‌ ప్రారంభ మ్యాచ్‌+ప్లే ఆఫ్‌లు +ఫైనల్‌). 
చదవండి: Joe Root: కుమారుల సెంచరీలు.. తండ్రుల ఆత్మీయ ఆలింగనం.. వీడియో!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top