ఐపీఎల్ 2026లో భాగంగా కేకేఆర్‌తో ఇవాళ (మార్చి 29) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేయగా.. ముంబై ఇండియన్స్ మరో 5 బంతులు మిగిలుండగానే (19.1 ఓవర్లలో) 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
రోహిత్ శర్మ (38 బంతుల్లో 78; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), ర్యాన్ రికెల్టన్ (43 బంతుల్లో 81; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకాలతో ముంబై గెలుపును ఖరారు చేయగా.. ఆతర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (8 బంతుల్లో 16; 3 ఫోర్లు), తిలక్ వర్మ (14 బంతుల్లో 20; 4 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (11 బంతుల్లో 18 నాటౌట్; 3 ఫోర్లు), నమన్ ధిర్ (2 బంతుల్లో 5 నాటౌట్; ఫోర్) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించారు.
కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, సునీల్ నరైన్ తలో వికెట్ తీయగా.. రికెల్టన్‌ను అనుకూల్ రాయ్ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు.
అంతకుముందు రహానే (40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 67 పరుగులు), ఫిన్ అలెన్ (17 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు), అంగ్క్క్రిష్ రఘువంశీ (29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు), రింకూ సింగ్ (21 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 33 నాటౌట్) సత్తా చాటడంతో కేకేఆర్ భారీ స్కోర్ చేసింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో కెమరూన్ గ్రీన్ (18) ఒక్కడే నిరాశపరిచాడు.
ముంబై ఇండియన్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (4-0-39-3), ట్రెంట్ బౌల్ట్ (4-0-38-0) అద్భుతంగా బౌలింగ్ చేయగా..హార్దిక్ పాండ్యా ఓ వికెట్ తీశాడు.


