చరిత్ర సృష్టించిన సునీల్‌ నరైన్‌ | IPL 2026, KKR VS MI: Sunil Narine creates history for Most matches by an overseas player in the IPL | Sakshi
Sakshi News home page

IPL 2026, KKR VS MI: చరిత్ర సృష్టించిన సునీల్‌ నరైన్‌

Mar 29 2026 7:51 PM | Updated on Mar 30 2026 10:23 AM

IPL 2026, KKR VS MI: Sunil Narine creates history for Most matches by an overseas player in the IPL

ఐపీఎల్‌ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మార్చి 29) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌ తుది జట్టులో చోటు దక్కించుకోవడంతో ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు (190) ఆడిన విదేశీ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. 

ఈ క్రమంలో తన దేశీయ (వెస్టిండీస్‌) సహచరుడు కీరన్‌ పోలార్డ్‌ను (189) అధిగమించాడు. ఈ విభాగంలో నరైన్‌, పోలార్డ్‌ తర్వాతి స్థానాల్లో ఏబీ డివిలియర్స్‌ (184), డేవిడ్‌ వార్నర్‌ (184), డ్వేన్‌ బ్రావో (161) ఉన్నారు. నరైన తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఆడిన 190 మ్యాచ్‌లు కేకేఆర్‌ తరఫునే ఆడటం మరో విశేషం.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే టాస్‌ గెలిచిన ఆనందం వారికి ఎంతో సేపు మిగల్లేదు. హార్దిక్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ పవర్‌ ప్లే ఆప్షన్‌ను సద్వినియోగం చేసుకుంటూ పేట్రేగిపోతుంది. 

ఓపెనర్లు అజి​ంక్య రహానే (10 బంతుల్లో 21; 3 సిక్సర్లు), ఫిన్‌ అలెన్‌ (14 బంతుల్లో 32; ఫోర్‌, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. 4 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 57-0గా ఉంది.

తుది జట్లు..

ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్‌కీపర్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, AM ఘజన్‌ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

కేకేఆర్‌: ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్‌), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్‌ కీపర్‌), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ

Advertisement
 
Advertisement
Advertisement