IPL 2026: కేకేఆర్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం | IPL 2026: KKR Vs Delhi Capitals Match Live Updates | Sakshi
Sakshi News home page

IPL 2026: కేకేఆర్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం

May 24 2026 7:17 PM | Updated on May 24 2026 11:41 PM

IPL 2026: KKR Vs Delhi Capitals Match Live Updates

కోల్‌క‌తా వేదిక‌గా జ‌రిగిన సీజన్ చివ‌రి మ్యాచ్‌లో కేకేఆర్‌పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ 40 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. 204 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కేకేఆర్ 18.4 ఓవ‌ర్ల‌లో  163 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కెప్టెన్ ర‌హానే (63) అర్థ‌సెంచ‌రీ సాధించ‌గా, పావెల్ (29), మ‌నీశ్ పాండే (25) ప‌ర్వాలేద‌నిపించారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్‌, ఎన్గిడి చెరో మూడు వికెట్ల‌తో విజృంభించ‌గా, మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు చేసింది. కేఎల్ రాహుల్ (60) అర్థశతకంతో రాణించాడు.

ఒకే ఓవ‌ర్లో రెండు వికెట్లు డౌన్‌
ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ ఒకే ఓవ‌ర్లో రెండు వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవ‌ర్‌లో మొద‌ట ర‌హానే (63) ఔట‌వ్వ‌గా, మ‌రుస‌టి బంతికి రింకూ సింగ్ గోల్డెన్ డ‌క్‌గా వెనుదిరిగాడు. 14 ఓవ‌ర్లు ముగిసేస‌రికి కేకేఆర్ 5 వికెట్ల న‌ష్టానికి 129 ప‌రుగులు చేసింది. పావెల్ (15), తేజ‌స్వి (1) ప‌రుగుతో ఆడుతున్నారు.

13 ఓవ‌ర్ల‌లో కేకేఆర్ 123/3
13 ఓవ‌ర్లు ముగిసేస‌రికి కేకేఆర్ 3 వికెట్ల న‌ష్టానికి 121 ప‌రుగులు చేసింది. ర‌హానే (59), రోవ్‌మెన్ పావెల్ (14) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్‌
ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ 87 ప‌రుగుల వ‌ద్ద‌ రెండో వికెట్ కోల్పోయింది. 25 ప‌రుగులు చేసిన మ‌నీశ్ పాండే ఎన్గిడి బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 9 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 2 వికెట్ల న‌ష్టానికి 93 ప‌రుగులు చేసింది. ర‌హానే (45), కామెరున్ గ్రీన్ (1) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్‌
204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 43 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన ఓపెనర్ ఫిన్ అలెన్ ఎన్గిడి బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. రహానే (23), మనీశ్ పాండే (4) పరుగులతో ఆడుతున్నారు.

కేకేఆర్ టార్గెట్ 204 ప‌రుగులు
రాజ‌స్తాన్ ప్లేఆఫ్స్‌కు చేర‌డంతో కేకేఆర్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ్యాచ్‌ నామ‌మాత్రంగా మారిపోయింది. ఈ నేప‌థ్యంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు చేసింది. కేఎల్ రాహుల్ (60) అర్థ‌సెంచ‌రీతో త‌న ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. 

కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ (39), డేవిడ్ మిల్ల‌ర్ (28), అశుతోశ్ శ‌ర్మ (18 నాటౌట్‌) రాణించ‌డంతో ఢిల్లీ 200 ప‌రుగుల మార్క్‌ను దాటింది. కేకేఆర్ బౌల‌ర్ల‌లో సౌర‌భ్ దూబే 2 వికెట్లు తీయ‌గా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, అనుకుల్ రాయ్‌, సునీల్ న‌రైన్‌లు త‌లా ఒక వికెట్ ప‌డగొట్టారు.

హాఫ్‌ సెంచరీ బాది కేఎల్‌ రాహుల్‌ ఔట్‌
ఢిల్లీ క్యాపిటల్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 30 బంతులకే హాఫ్‌ సెంచరీ బాది జోరు మీదున్న కేఎల్‌ రాహుల్‌ అనుకుల్‌ రాయ్‌ బౌలింగ్‌లో రోవ్మన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఢిల్లీ స్కోరు 14 ఓవర్లకు 135-3గా ఉంది.

మరో వికెట్‌ డౌన్‌
ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో వికెట్‌ కోల్పోయింది. సాహిల్ ప‌రాఖ్ 24 పరుగులు చేసి, సునిల్‌ నరైన్‌ బౌలింగ్‌లో అజింక్యా రహానెకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఢిల్లీ స్కోరు 10 ఓవర్లకు 88-2గా ఉంది. 

8 ఓవర్లలో ఢిల్లీ 70/1
8 ఓవర్లు ముగిసేస‌రికి ఢిల్లీ క్యాపిట‌ల్స్ వికెట్ న‌ష్టానికి 70 ప‌రుగులు చేసింది. సాహిల్ ప‌రాఖ్ (15), కేఎల్ రాహుల్ (31) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 22 ప‌రుగులు చేసిన అభిషేక్ పొరేల్ సౌర‌భ్ దూబే బౌలింగ్‌లో తేజ‌స్వీ ద‌హియాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 5 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ వికెట్ న‌ష్టానికి 42 ప‌రుగులు చేసింది.

టాస్ గెలిచిన కేకేఆర్
టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కేకేఆర్‌కు చాలా కీల‌కం. కాగా ఢిల్లీ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. ముకేశ్‌ కుమార్‌, కుల్దీప్‌ స్థానంలో అకిబ్‌ నబీ, త్రిపురానా  జట్టులోకి వచ్చారు. ముఖాముఖి పోరులో ఇరుజ‌ట్లు 36 సార్లు త‌ల‌ప‌డితే ఢిల్లీ 15 సార్లు, కేకేఆర్ 21 సార్లు నెగ్గాయి. సీజ‌న్ తొలి అంచె పోటీల్లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై కేకేఆర్ 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

పంజాబ్‌, రాజ‌స్తాన్‌లు ప్లేఆఫ్ రేసులో ఉన్న‌ప్ప‌టికీ కేకేఆర్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోవడంతో, ఢిల్లీ విధించే టార్గెట్‌ను 13 ఓవ‌ర్ల‌లో ఛేదించాల్సి ఉంటుంది.

ఢిల్లీ క్యాపిటల్స్: అభిషేక్ పోరెల్, కేఎల్‌ రాహుల్ (వికెట్‌ కీపర్‌), సాహిల్ పరాఖ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(కెప్టెన్‌), అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, ఔకిబ్ నబీ దార్, మిచెల్ స్టార్క్, లుంగి నిగిడి.

కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే(కెప్టెన్‌), మనీష్ పాండే, కెమెరూన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, తేజస్వి దహియా(వికెట్‌కీపర్‌), అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, సౌరభ్ దూబే, వరుణ్ చక్రవర్తి, కార్తీక్ త్యాగి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement