ఐపీఎల్-2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్‌కు దిగింది.
Delhi Capitals vs Punjab kings Updates:
సెంచరీ మిస్
18.3: బార్ట్‌లెట్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన నితీశ్ రాణా. 44 బంతుల్లో 91 పరుగులు చేసిన రాణా. స్కోరు: 248-2(18.3). క్రీజులోకి మిల్లర్.
సూపర్ ట్విస్టు
16.6: చహల్ బౌలింగ్‌లో మార్కస్ స్టొయినిస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన నితీశ్ రాణా. 39 బంతుల్లో 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగిన వన్‌డౌన్ బ్యాటర్. అయితే, ఇక్కడ ఊహించని ట్విస్టు చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఢిల్లీ రివ్యూకు వెళ్లగా అది సిక్సర్‌గా తేలింది. దీంతో నితీశ్ రాణాకు లైఫ్ లభించింది. అయితే, స్కోరు: 226-1(17). కేఎల్ రాహుల్ 129 పరుగులతో ఉన్నాడు.
కేఎల్ రాహుల్ సెంచరీ
47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్. 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో వంద పరుగులు మార్కు అందుకున్న ఓపెనింగ్ బ్యాటర్. స్కోరు: 189-1(15). నితీశ్ రాణా 36 బంతుల్లో 72 పరుగులతో రాహుల్‌కు తోడుగా ఉన్నాడు.
దుమ్ములేపిన నితీశ్ రాణా
11.3: జేవియర్ బార్ట్‌లెట్ బౌలింగ్‌లో ఫోర్ బాది యాభై పరుగులు పూర్తి చేసుకున్న నితీశ్ రాణా. బార్ట్‌లెట్ ఓవర్లో 6,4,4,4,4,6 బాదిన నితీశ్. ఢిల్లీ స్కోరు: 142-1(12)
పది ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 102-1
రాహుల్ 56, నితీశ్ రాణా 35 పరుగులతో ఉన్నారు.
రాహుల్ హాఫ్ సెంచరీ
9.1: విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్. 26 బంతుల్లో రాహుల్ ఫిఫ్టీ.
A loud cheer at Arun Jaitley Stadium as #KLRahul completes a fine fifty off 26 balls! 🤌
Will he keep going & guide #DC to a huge total? 💙#TATAIPL 2026 | #DCvPBKS | LIVE NOW 👉https://t.co/iY4R1ZY1Yn pic.twitter.com/IsGMZ1NN4g— Star Sports (@StarSportsIndia) April 25, 2026
పవర్ ప్లేలో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు: 68-1(6)
కేఎల్ రాహుల్ 16 బంతుల్లో 35 పరుగులతో, నితీశ్ రాణా 13 బంతుల్లో 22 పరుగులతో ఉన్నారు.
ఢిల్లీ తొలి వికెట్ డౌన్
28 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన నిస్సాంక.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
2 ఓవర్లకు ఢిల్లీ స్కోరెంతంటే?
2 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(12), నిస్సాంక(11) ఉన్నారు.
బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
ఐపీఎల్-2026లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు గత మ్యాచ్‌లో ఆడిన జట్లునే కొనసాగించాయి.
తుది జట్లు
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్‌కీపర్), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
ఢిల్లీ క్యాపిటల్స్ : కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, కులదీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్


