IPL 2025: కేకేఆర్‌పై సీఎస్‌కే విజయం​ | IPL 2025: KKR VS CSK Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

IPL 2025: కేకేఆర్‌పై సీఎస్‌కే విజయం​

May 7 2025 7:13 PM | Updated on May 7 2025 11:17 PM

IPL 2025: KKR VS CSK Live Updates And Highlights

Photo Courtesy: BCCI

కేకేఆర్‌పై సీఎస్‌కే విజయం​
ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (మే 7) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్‌కే 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నూర్‌ అహ్మద్‌ 4 వికెట్లు తీసి కేకేఆర్‌ను దెబ్బేశాడు. అన్షుల్‌ కంబోజ్‌, జడేజా తలో వికెట్‌ తీశారు. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో రహానే (48), మనీశ్‌ పాండే (36 నాటౌట్‌), రసెల్‌ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్‌కే 60 పరుగులకే సగం​ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ.. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (52) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో తన జట్టును తిరిగి గెలుపు ట్రాక్‌లో పెట్టాడు. మధ్యలో దూబే (45) బాధ్యతాయుతంగా ఆడి సీఎస్‌కే విజయతీరాలవైపు మళ్లించాడు. 

ఆఖరి ఓవర్‌లో 8 పరుగులు అవసరమైన తరుణంలో అప్పటిదాకా కామ్‌గా ఉన్న ధోని (17 నాటౌట్‌) సిక్సర్‌ కొట్టి సీఎస్‌కేకు గెలుపుకు చేరువ చేశాడు. నాలుగో బంతికి కంబోజ్‌ బౌండరీ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఈ గెలుపు వల్ల సీఎస్‌కేకు ఒరిగేది ఏమీ లేనప్పటికీ కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను దెబ్బకొట్టింది. 

సీఎస్‌కే గెలవాలంటే 30 బంతుల్లో 40 పరుగులు చేయాలి
15 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్‌ 140/6గా ఉంది. ధోని (3), దూబే (24) క్రీజ్‌లో ఉన్నారు. 

ఆరో వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే
12.1వ ఓవర్‌- 11వ ఓవర్‌లో 30 పరుగులు రాబట్టిన బ్రెవిస్‌ వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 

బ్రెవిస్‌ విధ్వంసం​.. ఒకే ఓవర్‌లో 30 పరుగులు
వైభవ్‌ అరోరా వేసిన 11వ ఓవర్‌లో డెవాల్డ్‌ బ్రెవిస్‌ శివాలెత్తిపోయాడు. 3 ఫోర్లు, 3 సిక్సర్లు సహా 30 పిండుకున్నాడు. ఈ ఒక్క ఓవర్‌తో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు ఓటమి ఖాయమనుకున్న సీఎస్‌కే ఒక్కసారిగా గెలుపు ట్రాక్‌లోకి వచ్చింది. 11 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్‌ 123/5గా ఉంది. బ్రెవిస్‌ 20 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. దూబే 12 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. 

60 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సీఎస్‌కే
5.2వ ఓవర్‌- సీఎస్‌కే 60 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో రవీంద్ర జడేజా (19) క్లీన్‌ బౌల్డయ్యాడు. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే
4.6వ ఓవర్‌- 56 పరుగుల వద్ద సీఎస్‌కే నాలుగో వికెట్‌ కోల్పోయింది. హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో రఘువంశీకి క్యాచ్‌ ఇచ్చి అశ్విన్‌ (8) ఔటయ్యాడు.

టార్గెట్‌ 180.. 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సీఎస్‌కే
180 పరుగుల లక్ష్య ఛేదనలో సీఎస్‌కే 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆయుశ్‌ మాత్రే, డెవాన్‌ కాన్వే డకౌట్‌ కాగా.. ఉర్విల్‌ పటేల్‌ 31 పరుగులకు ఔటయ్యారు. అశ్విన్‌ (4), జడేజా క్రీజ్‌లో ఉన్నారు. 3 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్‌ 37/3గా ఉంది. కేకేఆర్‌ బౌలర్లలో వైభవ్‌ అరోరా, మొయిన్‌ అలీ, హర్షిత్‌ రాణా తలో వికెట్‌ తీశారు.  

నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన కేకేఆర్‌
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నామమాత్రపు స్కోర్‌కు పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నూర్‌ అహ్మద్‌ 4 వికెట్లు తీసి కేకేఆర్‌ను దెబ్బేశాడు. అన్షుల్‌ కంబోజ్‌, జడేజా తలో వికెట్‌ తీశారు. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో రహానే (48), మనీశ్‌ పాండే (36 నాటౌట్‌), రసెల్‌ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

ఐదో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌.. రసెల్‌ ఔట్‌
16.6వ ఓవర్‌- 149 పరుగుల వద్ద కేకేఆర్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. డేంజరెస్‌గా కనిపిస్తున్న ఆండ్రీ రసెల్‌ (38) నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో బ్రెవిస్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 

15 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 124/4
రసెల్‌ 18, మనీశ్‌ పాండే 17 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌.. రహానే ఔట్‌
12.2వ ఓవర్‌- 103 పరుగుల వద్ద కేకేఆర్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్‌ ఇచ్చి రహానే (48) ఔటయ్యాడు. 

12 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 101/3
రహానే (31 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మనీశ్‌ పాండే (13 బంతుల్లో 14) క్రీజ్‌లో ఉన్నారు. 

మూడో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
నూర్‌ అహ్మద్‌ వేసిన ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌లో కేకేఆర్‌ రెండు వికెట్లు కోల్పోయింది. తొలి బంతికి నరైన్‌ ఔట్‌ కాగా.. నాలుగో బంతికి రఘువంశీ (1) పెవిలియన్‌కు చేరాడు. నరైన్‌ను స్టంపౌట్‌ చేసిన ధోని, రఘువంశీ క్యాచ్‌ కూడా పట్టుకున్నాడు. 8 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 73/3గా ఉంది. రహానే (32), మనీశ్‌ పాండే (1) క్రీజ్‌లో ఉన్నారు. 

రెండో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కేకేఆర్‌ ధాటిగా ఆడుతుంది. 7 ఓవర్లలో ఆ జట్టు వికెట్‌ నష్టానికి 69 పరుగులు చేసింది.8వ ఓవర్‌ తొలి బంతికి నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో సునీల్‌ నరైన్‌ (26) స్టంపౌటయ్యాడు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కేకేఆర్‌
ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (మే 7) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌, సీఎస్‌కే తలపడుతున్నాయి. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం కేకేఆర్‌ ఓ మార్పు చేసింది. వెంకటేశ్‌ అయ్యర్‌ స్థానంలో మనీశ్‌ పాండే తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు సీఎస్‌కే ఈ మ్యాచ్‌లో ప్రయోగాల బాట పట్టింది. ఉర్విల్‌ పటేల్‌, డెవాన్‌ కాన్వే, అశ్విన్‌ తుది జట్టులోకి వచ్చారు.

ఈ సీజన్‌లో సీఎస్‌కే కథ ముగిసిన విషయం తెలిసిందే. ఆ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఆడిన 11 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది.

కేకేఆర్‌ విషయానికొస్తే.. ఈ జట్టు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం ఇంకా పోటీలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 11 పాయింట్లు సాధించింది. ఓ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో ఓ పాయింట్‌ వచ్చింది. కేకేఆర్‌ ఈ మ్యాచ్‌తో కలుపుకుని ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్‌ రేసులో ఉంటుంది.

తుది జట్లు..

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), సునీల్ నరైన్, అజింక్యా రహానే(c), అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తి

ఇంపాక్ట్ సబ్స్: హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, లువ్నిత్ సిసోడియా, అన్రిచ్ నోర్ట్జే, మయాంక్ మార్కండే

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ఆయుష్ మ్హత్రే, ఉర్విల్ పటేల్, డెవాన్ కాన్వే, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రీవిస్, రవిచంద్రన్ అశ్విన్, MS ధోని(w/c), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా

ఇంపాక్ట్ సబ్స్: శివమ్ దూబే, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, జామీ ఓవర్టన్, దీపక్ హుడా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement