IPL 2023: Virat Kohli Teary Eyed PIC Goes Viral After RCB Loss To GT - Sakshi
Sakshi News home page

#Virat Kohli: కన్నీరు పెట్టుకున్న కోహ్లి.. ఓడినా పర్వాలేదు! ఎప్పటికీ నీవు మా కింగ్‌వే!

Published Mon, May 22 2023 7:48 AM

IPL 2023: Virat Kohlis Teary Eyed PIC Goes Viral - Sakshi

ఐపీఎల్‌-2023లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కథ ముగిసింది. ఈ సారైనా టైటిల్‌ను గెలిచి 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భావించిన ఆర్సీబీకి మరోసారి నిరాశ ఎదురైంది. ఫ్లేఆఫ్స్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  6 వికెట్ల తేడాతో బెంగళూరు ఓటమి చవి చూసింది.

198 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఆర్సీబీ బౌలర్లు విఫలమయ్యారు. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ కేవలం 19.1 ఓవర్లలోనే ఛేదించింది. గుజరాత్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. గిల్‌ 52 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 104 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.



ఒకే ఒక్కడు..
అంతకు ముందు ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లి మరో అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ జట్టు బాధ్యతను తన భుజాన వేసుకున్న కింగ్‌.. స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 61 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 101 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ సెంచరీతో ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్‌ నిలిచాడు. ఇప్పటివరకు ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌ ఏడు సెంచరీలు సాధించాడు. ఈ క్రమంలో గేల్‌ రికార్డును కోహ్లి బ్రేక్‌ చేశాడు.

కన్నీరు పెట్టుకున్న కోహ్లి..
ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలవ్వగానే కోహ్లి కన్నీరు పెట్టుకున్నాడు. ఆఖరిలో డగౌట్‌ కూర్చోని మ్యాచ్‌ను వీక్షించిన కోహ్లి.. తన జట్టు ఓడిపోవడంతో ఒక్కసారిగా భావద్వోగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక కోహ్లి కన్నీరు పెట్టుకోవడం అభిమానులకు ఎంతో భాదను కలిగిస్తోంది.

ఈ క్రమంలో విరాట్‌కు ఫ్యాన్స్‌ సపోర్ట్‌గా నిలుస్తున్నారు. "ఓడిపోయినా పర్వాలేదు.. ఎప్పటికీ నీవు మా కింగ్‌వే" అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఒక ఓవరాల్‌గా ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 639 పరుగులు సాధించి ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో మూడో స్థానంలో నిలిచాడు.
చదవండి#ShubmanGill: సెంచరీతో కదం తొక్కి.. ఆర్‌సీబీని ఇంటికి పంపి


 

Advertisement
Advertisement