IPL 2023 Dinesh Karthik: ఎంత పనిచేశావు కార్తీక్‌.. లేదంటేనా? అయ్యో ఆర్సీబీ! వీడియో వైరల్‌

IPL 2023: Dinesh Karthiks run out miss, leads to Lucknows last ball win - Sakshi

ఐపీఎల్‌-2023లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌ అభిమానులకు అసలు సిసలైన  క్రికెట్‌ మజా అందించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో ఒక్క వికెట్‌ తేడాతో విజయం సాధించింది.  

213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో స్టోయినిష్‌((30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), పూరన్‌(19 బంతుల్లో  62, 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో లక్నోను గెలుపుకు దగ్గరగా తీసుకు వెళ్లారు. అయితే హర్షల్‌ పటేల్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో లక్నో విజయానికి కేవలం 5 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి.  

తొలి బంతికి ఉనద్కట్‌ సింగిల్‌ తీశాడు. అనంతరం రెండో బంతికి వుడ్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బిష్ణోయ్‌ మూడో బంతికి రెండు పరుగులు తీశాడు. దీంతో ఆఖరి మూడు బంతుల్లో లక్నో విజయ సమీకరణం రెండు పరుగులుగా మారింది. నాలుగో బంతికి బిష్ణోయ్‌ సింగిల్‌ తీసి ఉనద్కట్‌ స్ట్రైక్‌ ఇచ్చాడు. దీంతో స్కోర్లు సమానం అయ్యాయి. అయితే ఐదో బంతికి ఉనద్కట్‌ ఔటయ్యాడు. దీంతో ఆర్సీబీ, లక్నో డగౌట్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఆర్సీబీ కొంపముంచిన డికే
ఈ సమయంలో వికెట్‌ కీపర్‌ దినేష్‌ కార్తీక్‌ చేసిన తప్పిదం ఆర్సీబీ కొంపముంచింది. హర్షల్‌ పటేల్‌ ఆఖరి బంతిని లో ఫుల్‌ టాస్‌గా సంధించాడు. స్ట్రైక్‌లో ఉన్న అవేష్‌ ఖాన్‌ బంతిని అంచన వేయడంలో విఫలమయ్యాడు. బ్యాట్‌కు బంతి తగలకపోయినా అవేష్‌ ఖాన్‌ బై రన్‌ కోసం పరిగెత్తాడు. ఈ క్రమంలో బంతిని అందుకోవడంలో దినేష్‌ కార్తీక్‌ విఫలమయ్యాడు.

ఒక వేళ కార్తీక్‌ బంతిని అందుకుని రనౌట్‌ చేసి ఉంటే మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసుండేది. కార్తీక్‌ బంతిని అందుకుని రనౌట్‌ చేయడంలో విఫలమకావడంతో లక్నో ఒక్క వికెట్‌ తేడాతో విజయం సాధించింది.

చదవండిIPL 2023 LSG vs RCB: చరిత్ర సృష్టించిన పూరన్‌.. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ ఫిప్టీ! వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top