Breadcrumb
Live Updates
IPL 2022: పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ లైవ్ అప్డేట్స్
గుజరాత్ టైటాన్స్‌ను గెలిపించిన రాహుల్ తెవాటియా
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆఖరి రెండు బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన దశలో రాహుల్ తెవాటియా రెండు సిక్స్‌లు కొట్టి జట్టును గెలిపించాడు. అంతకముందు శుబ్‌మన్ గిల్ 96 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. హార్దిక్ పాండ్యా 27 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబాడ 2, రాహుల్ చహర్ ఒక వికెట్ తీశాడు. కాగా గుజరాత్ టైటాన్స్‌కు ఇది హ్యాట్రిక్ విజయం కావడం విశేషం.
గిల్, హార్దిక్ పాండ్యా ఔట్.. గుజరాత్ 172/4
గుజరాత్ టైటాన్స్ వరుస ఓవర్లలో గిల్(96), పాండ్యా(27) వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. విజయానికి 4 బంతల్లో 17 పరుగులు చేయాల్సి ఉంది.
సాయి సుదర్శన్ (35) ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్
నిలకడగా ఆడుతున్న సాయి సుదర్శన్(35) రాహుల్ చహర్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. గిల్ 89, హార్దిక్ పాండ్యా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
గిల్ దూకుడు.. గుజరాత్ 128/1
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నాడు. 48 బంతుల్లోనే 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 84 పరుగులతో ఆడుతున్న గిల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. సాయి సుదర్శన్ 35 పరుగులతో గిల్‌కు సహకారం అందిస్తున్నాడు. ప్రస్తుతం గుజరాత్ వికెట్ నష్టానికి 128 పరుగులు చేసింది.
ధాటిగా ఆడుతున్న గుజరాత్.. 9 ఓవర్లలో 88/1
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ దూకుడుగా ఆడుతోంది. 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. గిల్ 58, సాయి సుదర్శన్ 23 పరుగులతో ఆడతున్నారు.
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్
190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఆరు పరుగులు చేసిన మాథ్యూ వేడ్ రబాడ బౌలింగ్‌లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. గిల్ 25, సాయి సుదర్శన్ 5 పరుగులతో ఆడుతున్నారు.
పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 190
గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ 27 బంతుల్లో 64 పరుగలుతో విధ్వంసం సృష్టించగా.. ధావన్ 35 పరుగులు చేశాడు. ఆఖర్లో రాహుల్ చహర్ 14 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 22 పరుగులు చేయడంతో పంజాబ్ భారీ స్కోరు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, దర్శన్ నల్కండే 2, పాండ్యా, ఫెర్గూసన్, షమీ తలా ఒక వికెట్ తీశారు.
రెండు ఓవర్ల వ్యవధిలో మూడు వికెట్లు డౌన్.. పంజాబ్ స్కోరెంతంటే
పంజాబ్ కింగ్స్ రెండు ఓవర్ల వ్యవధిలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రాహుల్ చహర్ 4, వైభవ్ అరోరా ఒక్క పరుగుతో ఆడుతున్నారు.
14 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 134/5
14 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. లియామ్ లివింగ్‌స్టోన్ 59, షారుక్ ఖాన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నాడు.
ధావన్(35) ఔట్.. పంజాబ్ కింగ్స్ 100/3
12 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ 39, జితేష్ శర్మ 10 పరుగులతో ఆడతున్నారు. అంతకముందు ధావన్(35) పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
బెయిర్ స్టో(8) ఔట్.. రెండో వికెట్ డౌన్
జానీ బెయిర్ స్టో(8) రూపంలో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఫెర్గూసన్ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న బెయిర్ స్టో నిరాశ పరిచాడు. ప్రస్తుతం పంజాబ్ 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. ధావన్ 27, లివింగ్ స్టోన్ 5 పరుగులతో ఆడుతున్నారు.
4 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 25/1
గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. ధావన్ 11, బెయిర్ స్టో 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఐదు పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య శుక్రవారం ఆసక్తికర పోరు మొదలైంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సూపర్ ఫామ్‌లో ఉండగా.. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి.. ఒక మ్యాచ్ ఓడింది.
Related News By Category
Related News By Tags
-
మ్యాక్స్‌వెల్ ఆల్‌రౌండ్ షో
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) 2026లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో బెల్ఫాస్ట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న అతడు, ఆల్‌రౌండ్ ప్...
-
బట్లర్ రికార్డుల మోత.. టీ20ల్లో నంబర్‌వన్‌గా ఇంగ్లండ్
శ్రీలంకను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్ తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించింది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా నంబర్‌వన్ ర్యాంకులో ఉన్న టీమిండియా రెండో స్థానానికి పడిపోయింద...
-
బట్లర్ విధ్వంసం.. ఇంగ్లండ్ చేతిలో శ్రీలంక వైట్‌వాష్
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో శ్రీలంక వైట్‌వాష్‌కు గురైంది. మాంచెస్టర్ వేదికగా శనివారం జరిగిన చివరి టీ20లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించింది. ఫలితంగా ఇంగ్లండ్ 3-0తో సిరీస్‌ను క్లీన...
-
నితీశ్ రెడ్డిపై గంభీర్ ప్రశంసలు.. వరల్డ్‌కప్ జట్టులో చోటు ఖాయమే!
ఆంధ్ర పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిపై టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ‘పరిమిత ఓవర్ల క్రికెట్లో పేస్ ఆల్‌రౌండర్ల ప్రాధాన్యం చాలా ఎక్కువ. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వ...
-
హెట్‌మైర్ శతకం వృధా
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2026 తుది అంకానికి చేరింది. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, జమైకా కింగ్స్‌మన్ జట్లు సెప్టెంబర్ 20న టైటిల్ కోసం పోరాడతాయి. ఇవాళ జరిగిన క్వాలిఫయర్-2లో గయానా అమెజాన్ ...


