Liam Livongstone: అంపైర్‌తో వాగ్వాదం.. ఆ కోపాన్ని బౌలర్‌పై చూపించాడు

IPL 2022: Liam Livingstone Argues Field Umpire After Umran Malik Bouncer - Sakshi

ఇంగ్లండ్‌ విధ్వంసకర ఆటగాడు లియామ్‌ లివింగ్‌స్టోన్‌ ఐపీఎల్‌ 2022లో సూపర్‌ ఫామ్‌ను కనబరుస్తున్నాడు. పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న లివింగ్‌స్టోన్‌ మెరుపు బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. భారీ సిక్సర్లు అవలీలగా బాదే లివింగ్‌స్టోన్‌ తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు చేసి ఔటయ్యాడు. పంజాబ్‌ కింగ్స్‌ 150 పరుగులు మార్క్‌ సాధించిందంటే అదంతా లివింగ్‌స్టోన్‌ ఇన్నింగ్స్‌ కారణం అని చెప్పొచ్చు.

అయితే ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో ఉమ్రాన్‌ మాలిక్‌ వేసిన బంతిపై అభ్యంతరం తెలిపిన లివింగ్‌స్టోన్‌ ఫీల్డ్‌ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ వేసిన ఆ ఓవర్‌ మూడో బంతిని లివింగ్‌స్టోన్‌ భారీ సిక్స్‌గా మలిచాడు. అయితే తన తర్వాతి బంతిని బౌన్సర్‌ వేసి లివింగ్‌స్టోన్‌కు పంచ్‌ ఇచ్చాడు. అయితే ఫీల్డ్‌ అంపైర్‌ దానిని బౌన్సర్‌ అని హెచ్చరించలేదు. ఇది చూసిన లివింగ్‌స్టోన్‌.. అంపైర్‌ వద్దకు వెళ్లి.. బౌన్సర్‌ కదా వార్నింగ్‌ ఇవ్వరా అంటూ అంపైర్లను అడిగాడు. కానీ ఫీల్డ్‌ అంపైర్‌ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

దీంతో కోపంతో క్రీజులోకి వెళ్లిన లివింగ్‌స్టోన్‌ తన ఆగ్రహాన్ని ఉమ్రాన్‌పై చూపించాడు. దాదాపు అదే తరహాలో వేసిన ఫుల్‌టాస్‌ బంతిని బౌండరీ తరలించాడు. అయితే నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న షారుక్‌ ఖాన్‌ కిందకు వంగడంతో పెను ప్రమాదం తప్పింది.  ఆ తర్వాతి లివింగ్‌స్టోన్‌ షారుక్‌ ఖాన్‌ వద్దకు రాగా..''వామ్మో బతికిపోయా అన్నట్లుగా'' షారుక్‌ లుక్‌ ఇవ్వడం వైరల్‌గా మారింది.

చదవండి: SRH vs PBKS: పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఆడకపోవడంపై ధావన్‌ క్లారిటీ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top