
PC: IPl.com
రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూ�...
పాల నురుగులా తెల్లగా ఉండాలంటే మేనుకి...
భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు.. హిమాచల్...
ప్రముఖ వ్యాపారవేత్త, హీరో రామ్‌చరణ్...
ప్రముఖ టీవీ నటుడు బడే అచ్చే లగ్తే హై ఫ...
సాక్షి, ఆంధ్రప్రదేశ్: దివంగత ముఖ్యమ�...
ఎన్నికల వేళ.. బీహార్‌లో రాజకీయంగానూ క�...
మనం సాదాసీదాగా చూసే పాములు వాటి తీరు�...
సాక్షి, హైదరాబాద్: వయసు పెరిగే కొద్ద�...
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియ�...
పార్కిన్సన్స్ వ్యాధి కాస్త వయసు పె...
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెల�...
తమిళనాడు ఘోర ప్రమాదం సంభవించింది. కడ�...
భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా అ...
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్�...
Apr 20 2022 6:53 PM | Updated on Apr 20 2022 10:38 PM
PC: IPl.com
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లైవ్ అప్డేట్స్
పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 116 పరుగుల స్పల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కోల్పోయి 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు వార్నర్(60), పృథ్వీ షా(41) పరుగులతో చెలరేగారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 115 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్,కుల్ధీప్ యాదవ్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. . ముస్తాఫిజర్ రెహ్మన్ ఒక్క వికెట్ సాధించాడు.
116 పరుగుల స్పల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 58 పరుగులు సాధించింది. క్రీజులో పృథ్వీ షా(26), డేవిడ్ వార్నర్(31) పరుగులతో ఉన్నారు.
ఐపీఎల్-2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 115 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. పంజాబ్ బ్యాటర్లలో జితేష్ శర్మ 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్,కుల్ధీప్ యాదవ్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. . ముస్తాఫిజర్ రెహ్మన్ ఒక్క వికెట్ సాధించాడు.
90 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పంజాబ్ కింగ్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. వరుస క్రమంలో మూడు వికెట్లు కోల్పోయింది.
14 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోర్: 90/7
54 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పంజాబ్ కింగ్స్ కష్టాల్లో పడింది. 9 పరుగులు చేసిన బెయిర్ స్టో.. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ముస్తాఫిజర్ రెహ్మన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 8 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోర్ 63/ 4
పంజాబ్ కింగ్స్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోతోంది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ స్టంపౌటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ మూడు వికెట్లు నష్టానికి 47 పరుగులు చేసింది.
పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. ముస్తాఫిజర్ రెహ్మన్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ క్లీన్ బౌల్డయ్యాడు. 5 ఓవర్లకు 44/2
33 పరుగుల వద్ద ధావన్ రూపంలో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన ధావన్ లలిత్ యాదవ్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
ఐపీఎల్-2022లో మరో ఉత్కంఠ భరిత పోరుకు తెరలేవనుంది. బ్రబౌర్న్ వేదికగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
పంజాబ్ కింగ్స్
మయాంక్ అగర్వాల్(కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, కగిసో రబడ, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్
ఢిల్లీ క్యాపిటల్స్
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్(కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్