David Warner: నిన్ను మిస్సయ్యాను బ్రో.. వార్నర్ ఎమోషనల్.. రషీద్ ఖాన్ ఏమన్నాడంటే!

IPL 2022 David Warner- Kane Williamson: సాధారణంగా ఆటగాళ్లెవరైనా మైదానంలో ఉన్నంత వరకే ‘ప్రత్యర్థులు’. ఒక్కసారి ఆట ముగిసిందంటే అంతా కలిసిపోతారు. సలహాలు, సూచనలు పంచుకుంటూ ముందుకు సాగుతారు. ఇక వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నా క్రికెటర్లుగా తాము అందరం ఒకటేనని.. తమ అనుబంధాన్ని చాటుకుంటూ ఉంటారు ఆటగాళ్లు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ మరోసారి ఈ విషయాన్ని నిరూపించారు. ఐపీఎల్-2022లో గురువారం ఢిల్లీ, హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.
ఇందులో వార్నర్ విజృంభణతో ఢిల్లీ.. హైదరాబాద్‌పై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఆట విషయాన్ని పక్కనపెడితే.. మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు అభిమానుల మనసు దోచుకుంటున్నాయి.
ముఖ్యంగా తనను ఘోరంగా అవమానించి బయటకు పంపిన సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీకి చెందిన ఆటగాళ్లతో వార్నర్ వ్యవహరించిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కెప్టెన్ కేన్‌తో సెల్ఫీ దిగిన వార్నర్.. ‘‘నిన్ను చాలా మిస్సయ్యాను బ్రో’’ అంటూ ఫొటో షేర్ చేశాడు. ఇందుకు స్పందించిన రషీద్ ఖాన్.. ‘‘నేను కూడా’’ అంటూ కామెంట్ చేశాడు.
ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇది చూసిన ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఇంతగా మిస్ అయితే మళ్లీ తిరిగి రావొచ్చు కదా అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. ఇక వార్నర్, రషీద్ ఖాన్ సుదీర్ఘకాలం పాటు సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్య వహించిన సంగతి తెలిసిందే. తాజా ఎడిషన్‌లో వార్నర్ ఢిల్లీకి ఆడుతుండగా.. రషీద్ టైటాన్స్ జట్టులో ఉన్నాడు.
చదవండి👉🏾 David Warner: ‘ప్రతీకారం తీర్చుకున్న వార్నర్’.. ఆ ఒక్క మాట చాలు.. దెబ్బ అదుర్స్ కదూ!
5⃣th win for @RishabhPant17 & Co. in the #TATAIPL 2022! 👏 👏
The @DelhiCapitals beat #SRH by 21 runs & return to winning ways. 👌 👌 #DCvSRH
Scorecard ▶️ https://t.co/0T96z8GzHj pic.twitter.com/uqHvqJPu2v
— IndianPremierLeague (@IPL) May 5, 2022
మరిన్ని వార్తలు