ఆ కారణంగానే విలియమ్సన్‌ను ఆడించట్లేదు: ఎస్‌ఆర్‌హెచ్ కోచ్‌‌ | IPL 2021: SRH Coach Trevor Bayliss Gives Clarity On Kane Williamson Recovery | Sakshi
Sakshi News home page

విలియమ్సన్‌ను ఆడించకపోవడంపై ఎస్‌ఆర్‌హెచ్ క్లారిటీ‌

Apr 15 2021 4:12 PM | Updated on Apr 15 2021 5:32 PM

IPL 2021: SRH Coach Trevor Bayliss Gives Clarity On Kane Williamson Recovery - Sakshi

చెన్నై: ఐపీఎల్‌ 2021 సీజన్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ముప్పేట దాడి మొదలైంది. జట్టు మిడిలార్డర్‌ బలహీనంగా ఉందని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ ఆ స్థానంలో సమర్ధవంతంగా బ్యాటింగ్‌ చేయగల కేన్‌ విలియమ్సన్‌ను తుది జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్‌లో మంచి ట్రాక్‌ రికార్డు కలిగిన విలియమ్సన్‌ను ఎందుకు ఆడించడంలేదన్న అంశంపై అభిమానుల మదిలో రకరకాల సందేహాలు మెదులుతున్నాయి. తొలి మ్యాచ్‌లో మహ్మద్‌ నబీ, రెండో మ్యాచ్‌లో జేసన్‌ హోల్డర్‌కు అవకాశం కల్పించిన మేనేజ్‌మెంట్‌కు మ్యాచ్‌ విన్నర్‌ అయిన విలియమ్సన్‌ కనిపించడం లేదా అంటూ అభిమానులు నిలదీస్తున్నారు.

ఈ నేపథ్యంలో తుది జట్టులో విలియమ్సన్‌ను ఎంపిక చేయకపోడంపై ఆ జట్టు కోచ్‌ ట్రెవర్‌ బేలిస్‌ మొదటిసారిగా నోరు విప్పాడు. జట్టు కూర్పు విషయంలో ఎటువంటి సమస్య లేదని, విలియమ్సన్‌ పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేకపోడంవల్లనే అతన్ని తుది జట్టులోకి తీసుకోవట్లేదని క్లారిటీ ఇచ్చాడు. ఫిట్‌నెస్‌ విషయంలో విలియమ్సన్‌ కసరత్తు చేస్తున్నాడని, అతను పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని వివరణ ఇచ్చాడు. మరోవైపు ఆర్‌సీబీతో మ్యాచ్‌లో నబీని తప్పించడంపై కూడా బేలిస్‌ వివరణ ఇచ్చాడు.

కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నబీ తలకు బలంగా గాయమైందని అందువల్లనే అతని స్థానంలో హోల్డర్‌కు అవకాశం ఇచ్చామని తెలిపాడు. కాగా, గత నెలలో బంగ్లాదేశ్‌ పర్యటనకు ముందు విలియమ్సన్‌ గాయం బారిన పడ్డాడు. దీంతో ఆ సిరీస్‌ మొత్తానికి అతను దూరమాయ్యడు. ఇదిలా ఉంటే నిన్న ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (37 బంతుల్లో 54; 7 ఫోర్లు, సిక్స్‌) హాఫ్ ‌సెంచరీ చేసినా.. మిడిలార్డర్‌ పూర్తిగా విఫలమవ్వడంతో ఎస్‌ఆర్‌హెచ్‌కు సీజన్‌లో వరుసగా రెండో పరాజయం తప్పలేదు. 
చదవండి: ఇది వార్నర్‌ తప్పిదం కాదా?
చదవండి: కోహ్లీ 'ఆ సలహా' వల్లే నేడు ఈ స్థాయికి: బాబర్ ఆజమ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement